NRI News: H1-B వీసాదారుల జీవిత భాగస్వాములకు శుభవార్త.. EADకి ఆటోమేటిక్ అనుమతి..

NRI News: ఇక నుంచి యూఎస్‎లో H-1B, L-1 వీసా దారుల జీవిత భాగస్వాములు వారి పని అధికారాల (EAD) ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ కోసం ఆటోమేటిక్ పొడిగింపులను పొందుతారు...

NRI News: H1-B వీసాదారుల జీవిత భాగస్వాములకు శుభవార్త.. EADకి ఆటోమేటిక్ అనుమతి..
Visa
Follow us

|

Updated on: Dec 13, 2021 | 12:33 PM

ఇక నుంచి యూఎస్‎లో H-1B, L-1 వీసా దారుల జీవిత భాగస్వాములు వారి పని అధికారాల (EAD) ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ కోసం ఆటోమేటిక్ పొడిగింపులను పొందుతారు. ఈ మేరకు బైడెన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. H-4 లేదా L-2 వీసాపై అర్హత పొందిన జీవిత భాగస్వాములు సకాలంలో EAD పునరుద్ధరణ దరఖాస్తు దాఖలు చేసిన వారి తీర్పు పెండింగ్‌లో ఉన్నట్లయితే, వారి ఉపాధి అధికార పత్రం (EAD) ఆటోమేటిక్‎గా 180 రోజుల వరకు పొడగింపు పొందుతారు. అయినప్పటికీ H-4 జీవిత భాగస్వాములకు సంబంధించిన అనేక ఆందోళనలు ఉన్నాయి. దీని సంబంధించి ప్రవాసభారతీయులు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. H-4 జీవిత భాగస్వాములకు సంబంధించిన అనేక ప్రశ్నాలకు సమాధానాలు ఇస్తున్నారు.

ప్ర: నా జీవిత భాగస్వామి ప్రస్తుతం U.S.లో H-4 హోదాలో ఉన్నారు. చెల్లుబాటు అయ్యే పని అధికారంతో పని చేస్తున్నారు. నా H-4 జీవిత భాగస్వామి యొక్క EAD ఆటోమేటిక్‎గా పొడిగిస్తారా..?

జ: EAD పొడిగింపు అవసరమయ్యే ప్రతి వ్యక్తి దాని కోసం దరఖాస్తు చేసుకోవాలి. EAD కేవలం సమయం గడిచే కొద్దీ పొడిగించరు. కొత్త పాలసీ మార్పుల ప్రకారం EAD “ఆటోమేటిక్‌గా పొడిగించబడుతుంది. EADని పునరుద్ధరించడానికి I-765 దరఖాస్తు EAD గడువు తేదీకి ముందు దాఖలు చేయాలి.

ప్ర: కొత్త పాలసీ మార్పుల ప్రకారం, నిర్దిష్ట ప్రమాణాలు పాటిస్తే నిర్దిష్ట డిపెండెంట్ కేటగిరీలు తమ ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (EAD) యొక్క ఆటోమేటిక్ ఎక్స్‌టెన్షన్‌కు అర్హత పొందవచ్చా?

జ:పైన పేర్కొన్న వాటి ఆధారంగా, ప్రస్తుతం H-4 హోదాలో ఉన్న మీ జీవిత భాగస్వామి ఆటోమేటిక్ EAD పొడిగింపుకు అర్హులు.

ప్ర:H-4 EADని కలిగి ఉన్న నా జీవిత భాగస్వామి తన EAD పొడిగింపు దరఖాస్తును దాఖలు చేశారు. ఆమె EAD యొక్క స్వయంచాలక పొడిగింపునకు అర్హులేనా. ప్రస్తుతం ఉన్న EADలో ఎంతకాలం పని చేయడానికి అతనికి అధికారం ఉంది?

జ: EAD యొక్క స్వయంచాలక పొడిగింపునకు దరఖాస్తు చేస్తే పొడగిస్తారు. EAD గడువు ముగింపు తేదీ నుండి 180 రోజులు ఉంటుంది. EAD పొడిగింపు అప్లికేషన్ తిరస్కరిస్తే.. ఆ వ్యక్తి వెంటనే పని ఆపివేయాలి.

ప్ర: నా జీవిత భాగస్వామి తన I-9 ధృవీకరణ కోసం పత్రాలను సమర్పించాలి. అతను ఇప్పుడే నవంబర్‌లో తన EAD పొడిగింపు దరఖాస్తును దాఖలు చేశాడు.అతని EAD గడువు డిసెంబర్ 3, 2021న ముగిసింది. అతను ఏ పత్రాలను సమర్పించాలి?

జ: స్వయంచాలక పొడిగింపు కోసం అర్హత పొందిన EAD పునరుద్ధరణ అప్లికేషన్ పెండింగ్‌లో ఉండగా.. I-9 ధృవీకరణ పత్రాలు సమర్పించాలి. చెల్లుబాటు అయ్యే H-4, E లేదా L-2 వలసేతర స్థితిని చూపుతున్న గడువు లేని ఫారమ్ I-94, ఫారమ్ I-797C రసీదు సమర్పించాలి

ప్ర: నా భర్త జనవరి 8, 2022న L-2 వీసాపై U.S.కి వస్తున్నారు. అతనికి ఇప్పటికే జాబ్ ఆఫర్ ఉంది. అతను ఎప్పుడు పని ప్రారంభించవచ్చు?

జ: కొత్త EAD పాలసీ ప్రకారం L-2 వీసాపై ఉన్న జీవిత భాగస్వామి స్వయంచాలకంగా పని చేయడానికి అధికారం కలిగి ఉంటారు. వారు ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ లేదా EAD కార్డ్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఇతర డిపెండెంట్ల నుండి E మరియు L ఆధారిత జీవిత భాగస్వాములను వేరు చేయడానికి ఫారమ్ I-94ని సవరించడానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) అవసరమైన చర్యలు తీసుకుంటోంది.

ప్ర: ప్రస్తుతం చెల్లుబాటు అయ్యే L-2 నాన్-ఇమ్మిగ్రెంట్ డిపెండెంట్ స్టేటస్‌లో ఉన్న నా జీవిత భాగస్వామి భవిష్యత్తులో ఆమె EAD కోసం దరఖాస్తు చేయనవసరం లేదని భావించడం సరైనదేనా?

జ: L-2 లేదా E జీవిత భాగస్వామి స్థితిని చూపే చెల్లుబాటు అయ్యే I-94 పత్రం ప్రవేశం, జారీ అయిన తర్వాత, E మరియు L వలసేతర జీవిత భాగస్వాములు EAD కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు.

Read Also.. Gautam Raghavan: ప్రవాసభారతీయుడికి వైట్ హౌస్‎లో కీలక పదవి.. వైట్ హౌస్ PPOగా నియమితులైన గౌతమ్ రాఘవన్..

కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్