Dubai Paperless Governance: సరికొత్త చరిత్ర సృష్టించిన దుబాయ్.. ఆ విషయంలో ప్రపంచంలోనే తొలి దేశంగా..

Dubai Paperless Governance: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రధాన నగరం అయిన దుబాయ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతూ..

Dubai Paperless Governance: సరికొత్త చరిత్ర సృష్టించిన దుబాయ్.. ఆ విషయంలో ప్రపంచంలోనే తొలి దేశంగా..
Dubai
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 13, 2021 | 1:37 PM

Dubai Paperless Governance: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రధాన నగరం అయిన దుబాయ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతూ.. 100 శాతం పేపర్‌లెస్‌ గవర్నెన్స్‌గా మారిన ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రభుత్వంగా దుబాయ్ అవతరించింది. ప్రభుత్వానికి సంబంధించి అన్ని రకాల అంతర్గత, బాహ్య సేవలను, ట్రాన్సాక్షన్స్‌ను వంద శాతం డిజిటల్‌ ఫార్మట్‌లోనే కొనసాగిస్తూ ఈ ఘనత సాధించింది. దీనికి సంబంధించి ఎమిరేట్స్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అధికార ప్రకటన విడుదల చేశారు. దుబాయ్ ప్రయాణంలో కొత్త దశ ప్రారంభమైందని, ఆవిష్కరణ, సృజనాత్మకత, భవిష్యత్తుపై దృష్టి కేంద్రీకరించే ప్రయాణం ఇది అని షేక్ హమ్దాన్ ఆ ప్రకటనలో తెలిపారు.

పేపర్‌లెస్ గవర్నెన్స్ ద్వారా.. 14 మిలియన్‌ గంటల మనిషి శ్రమను, 1.3 బిలియన్‌ దిర్‌హమ్‌(350 మిలియన్‌ డాలర్లు) ఆదా చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాదు.. ఈ ఘనత సాధించడం వల్ల ప్రపంచానికే డిజిటల్ రాజధానిగా దుబాయ్ నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దుబాయ్‌లో పేపర్‌లెస్ స్ట్రాటజీని ఐదు వరుస దశల్లో అమలు చేయడం జరిగిందని తెలిపారయన. ఇదిలా ఉంటే అమెరికా, యూకే, యూరప్‌ దేశాల్లోని ప్రభుత్వాలు సైతం డిజిటల్ వ్యవస్థ బలోపేతానికి కృషి చేయాయి. అయితే, సైబర్ దాడుల భయంతో ఆ ప్రయత్నం కాస్తా నెమ్మదించింది. దుబాయ్ మాత్రం ధైర్యంతో ముందడుగు వేసి ఈ ఫీట్‌ను సాధించింది. ఇక ప్రపంచంలోనే ధనిక నగరాల్లో ఒకటిగా ఉన్న దుబాయ్‌‌లో జనాభా 35 లక్షలు కాగా.. మెట్రో ఏరియాలో జనాభా 29 లక్షలకు పైగా ఉంది.

Also read:

Royal Enfield: త్వరలో మార్కెట్‌లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350.. రాజసం మామూలుగా లేదుగా..!

Amaragiri Trip : తెలంగాణ ఊటీ.. దేశంలోనే ఓ అద్భుత పర్యాటక కేంద్రం మన అమరగిరి..!

Narendra Modi In Varanasi: మరోసారి సింప్లిసిటీ చాటుకున్న ప్రధాని మోదీ.. ఓ సామాన్య వ్యక్తి అందించిన..

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..