Miss Universe 2021: మిస్ యూనివర్స్ హర్నాజ్‌కు ఆనంద్ మహేంద్ర ప్రశంసలు.. కొత్తవార ఆరంభాన శుభవార్త అంటూ..

Miss Universe 2021: భారత దేశానికి మూడోసారి మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందించిన అందాల సుందరి హర్నాజ్ సంధు పై దేశ వ్యాప్తంగా ప్రశంసల వర్షం..

Miss Universe 2021: మిస్ యూనివర్స్ హర్నాజ్‌కు ఆనంద్ మహేంద్ర ప్రశంసలు.. కొత్తవార ఆరంభాన శుభవార్త అంటూ..
Miss Universe 2021
Follow us
Surya Kala

|

Updated on: Dec 13, 2021 | 1:05 PM

Miss Universe 2021: భారత దేశానికి మూడోసారి మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందించిన అందాల సుందరి హర్నాజ్ సంధు పై దేశ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇజ్రాయిల్ వేదికగా జరిగిన మిస్ యూనివర్స్ 2021 పోటీల్లో 80 దేశాలకు చెందిన అందరిల సుందరీమణులు పాల్గొన్నారు. వీరందరిని ఓడించి మిస్ యూనివర్స్ 2021 కిరీటాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది నటి,  మోడల్ హర్నాజ్ సంధు. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ వేదికగా హర్నాజ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో మిస్ యూనివర్స్ కిరీటాన్ని ఇచ్చిన చివరి ప్రశ్న.. దాని హర్నాజ్ సమాధానం ఉన్న వీడియో షేర్ చేశారు.

అంతేకాదు ఈ వీడియోకి “వారాన్ని ప్రారంభించడానికి ఇది ఇంతకంటే శుభవార్త మరొకటి లేదంటూ తన సంతోషాన్ని కామెంట్ ద్వారా తెలిపారు.

ఈవెంట్ లో చివరి ప్రశ్నోత్తరాల రౌండ్లో, యువతులు ఈరోజు ఎదుర్కొంటున్న ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో మీరు చెప్పే సలహా ఏమిటి అని అడిగారు. “నేటి యువత ఎదుర్కొంటున్న అతి పెద్ద ఒత్తిడి ఏమిటంటే, తమపై తమకు విశ్వాసం కోల్పోవడం.. ఎవరికీ వారు ప్రత్యేకమని తెలుసుకోకపోవడం అంతేకాదు ఇతరులతో పోల్చుకోవడం అని చెబుతూనే.. అందంగా మారాలంటే.. మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోవడం మానేయండని చెప్పారు.

అంతేకాదు నేటి యువత తనని తాను అర్ధం చేసుకోవాలి. బయట సమాజంలోకి రావాలి.. మీ కోసం మీరు మాట్లాడాలి.. ఎందుకంటే ఎవరి జీవితానికి వారే నాయకుడు.. కనుక మీ వాయిస్ ని సమాజంలో వినిపించండి.. నేను నమ్మను.. అదే పాటించాను.. అందుకనే ఈరోజు నేడు ఈ స్టేజ్ మీద నిలబడి ఉన్నాను అంటూ హర్నాజ్ ఆత్మవిశ్వాసంతో సమాధానం చెప్పింది. వెంటనే అక్కడ చప్పట్లు మారుమ్రోగాయి.

ఇప్పుడు హర్నాజ్ చెప్పిన సమాధానంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నిజమే నేటి యువత ఓటమికి ముఖ్య కారణం స్వీయ నియంత్రణ విశ్వాసం లేకపోవడం.. ఒకరితో పోల్చుకుంటూ ఒత్తిడికి లోనుకావడం అంటూ సింధు సలహాపై అభినందన వర్షం కురిపిస్తున్నారు.

Also Read:  వెంకన్న దర్శనానికి వెళ్తూ.. ప్రీ బస్సులో సీటు కోసం కొట్టుకున్న భక్తులు.. ఎక్కడంటే..