AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

West Godavari: వెంకన్న దర్శనానికి వెళ్తూ.. ప్రీ బస్సులో సీటు కోసం కొట్టుకున్న భక్తులు.. ఎక్కడంటే..

Dwaraka Tirumala: భగవంతుడా నాకు మాత్రమే ఎందుకు ఇన్ని కస్టాలు పెట్టావు. ఎపుడు వీటినుంచి విముక్తి కలిగిస్తావు. నాకు సొంత ఇల్లు కట్టుకునే శక్తి ఇవ్వు , ఉద్యోగం ఇవ్వు..

West Godavari: వెంకన్న దర్శనానికి వెళ్తూ.. ప్రీ బస్సులో సీటు కోసం కొట్టుకున్న భక్తులు.. ఎక్కడంటే..
Dwaraka Tirumala
Surya Kala
|

Updated on: Dec 13, 2021 | 12:36 PM

Share

Dwaraka Tirumala: భగవంతుడా నాకు మాత్రమే ఎందుకు ఇన్ని కస్టాలు పెట్టావు. ఎపుడు వీటినుంచి విముక్తి కలిగిస్తావు. నాకు సొంత ఇల్లు కట్టుకునే శక్తి ఇవ్వు , ఉద్యోగం ఇవ్వు , వ్యాపారంలో కోట్లు , రాజకీయాల్లో పదవులు, పిల్లలలకు పెళ్లి ,..ఇలా ఒక్కో మనిషికి ఒక్కో కోరిక ఉంటుంది. వాటిని తీర్చమని కోరుతూ భక్తులు గుడికి వెళ్తారు. దేవుడిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. అయితే ఇలా దర్శనం చేసుకునే సమయంలో ఎవరైనా ఒకరిని దాటుకుని ముందుకు వెళ్ళారా ఇక కొందరు విరుచుకుపడ్డారు. ముఖ్యంగా క్యూ లైన్ లో దేవుడి దర్శనం కోసం వేచి చూసే కొందరు భక్తులు  తమను దాటుకుని ప్రోటోకాల్ పేరుతోనో, పైరవితోనో తమకంటే ముందు దర్శనం చేసుకున్నాడా ఇక అంతే.. గుడి, దేవుడి అన్న విచక్షణ మరచిపోతారు. తిట్ల దండకంతో పాటు..  ఘర్షణలకు దిగటానికి కూడా వెనుకాడరు. నలుగురిలోనూ నవ్వుల పాలవుతారు. తాజాగా ఇటువంటి సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

ఏపీలో చిన్న తిరుపతిగా పేరుగాంచిన పశ్చిమగోదావరిజిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల. ద్వారక తిరుమలలో కొలువైన చిన వెంకన్నను దర్శించుకునేందుకు కొంతమంది భక్తులు ఉచిత బస్సుని ఎక్కారు. అయితే బస్సులో సీటు కోసం సిగపట్లు పట్టుకున్నారు. తీవ్రంగా తిట్టుకున్నారు. ఏకంగా  సీటు కోసం కొందరు కొట్టుకున్నారు. గోవిందుడుని దర్శించుకోవడానికిఉ వెళ్తూ.. బస్సులో సీటు లేకపోతె కొంచెం సేపు నిల్చుంటే సరిపోతుంది కదా.. ఐదు నిమిషాల ప్రయాణం కోసం గొడవపడిన భక్తులను చూసి మిగతా భక్తులు నవ్వుకున్నారు.

Reporter: B Ravikumar west godavari, TV9 telugu

Also Read:  ఈఏడాది ట్విట్టర్లో ట్రెండ్ అయిన టాప్ 10 హీరోస్.. పవన్, మహేష్‌లు ఏ ప్లేస్ దక్కించుకున్నారంటే..