Twitter Top 10 Heroes: ఈఏడాది ట్విట్టర్లో ట్రెండ్ అయిన టాప్ 10 హీరోస్.. పవన్, మహేష్‌లు ఏ ప్లేస్ దక్కించుకున్నారంటే..
Twitter Top 10 Heroes: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సినీ నటీనటుల నుంచి రాజకీయనేతల నుంచి సామాన్యులు వరకూ తమకు..
Twitter Top 10 Heroes: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సినీ నటీనటుల నుంచి రాజకీయనేతల నుంచి సామాన్యులు వరకూ తమకు సంబంధించిన విశేషాలను షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా ట్విట్టర్ ప్రపంచంలో అనేక అంశాలను నెటిజన్లు తమ స్పందనను వ్యక్త పరుస్తున్నారు. ఈ నేపథ్యంలో 2021లో స్టార్ హీరోలపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇక 2021 ఏడాది చివరికి వచ్చేసింది. దీంతో 2021 దక్షిణాదిలో ట్విట్టర్ లో ఎక్కువగా ట్వీట్ చేయబడిన స్టార్ హీరోల పేర్లను ప్రకటించేశారు. ఈ టాప్ టెన్ హీరోల లిస్ట్ లో టాలీవుడ్ కోలీవుడ్ హీరోల మధ్య గట్టి పోటీ నెలకొంది. దక్షిణాది హీరోల్లో టాప్ 10 ప్లేస్ లో ఉన్న దక్షిణాది హీరోలు ఎవరు.. మొదటి ప్లేస్ ని ఎవరు దక్కించుకున్నారో చూద్దాం.. వివరాల్లోకి వెళ్తే..
*10 ప్లేస్ ను తెలుగు అబ్బాయికోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సొంతం చేసుకున్నాడు. అయితే టాప్ టెన్ హీరోల్లో ఒక ప్లేస్ ను సొంతం చేసుకున్న హీరో అజిత్ కు అసలు సోషల్ మీడియాలో అకౌంట్ లేకపోవడం విశేషం.
*టాప్ 9 ప్లేస్ లో కోలీవుడ్ హీరో ధనుష్ దక్కించుకున్నారు. డిఫరెంట్ సినిమాలతో ఆకట్టుకున్న ధనుష్ పేరు పోస్టర్లు ట్విట్టర్ లో బాగా వైరస్ అయింది.
* 8వ స్థానంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దక్కించుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ పేరు ట్రెండ్ అయింది.
* 7వ ప్లేస్ ను తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ సొంతం చేసుకున్నారు. పెద్దన్న సినిమాతో పాటు రాజకీయ అంశాలతో రజనీకాంత్ ట్విట్టర్ లో హల్ చల్ చేశారు.
*6వ ప్లేస్ లో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలిచారు. పుష్ప సినిమాతో పాటు బన్నీ తన పిల్లలు అయాన్, అర్హలతో ఉన్న ఫొటోస్ తో ట్విట్టర్ ట్రెండ్ అయ్యాడు.
*5వ ప్లేస్ లో జూనియర్ ఎన్టీఆర్ నిలిచాడు. తారక్ పేరు కూడా ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు ఎవరు మీలో కోటీశ్వరుడుతో ట్రెండ్ అయ్యాడు.
*4వ ప్లేస్ లో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నిలిచారు. దక్షిణాదిలో ట్విట్టర్ లో ట్రెండ్ అవ్వడానికి కారణం.. జై భీమ్ సినిమాతో ట్రెండ్ అయ్యారు.
* 3వ స్థానంలో సూపర్ స్టార్ మహేష్ నిలిచారు. సర్కారు వారి పాట సినిమాతోనే హాట్ టాపిక్ గా నిలిచాడు.
*సెకండ్ ప్లేస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిలిచారు. పవన్ కళ్యాణ్ వరస సినిమాలతో బిజీగా ఉన్నా.. ఎక్కువగా రాజకీయాలకు సంబందించిన అంశాలతో హాట్ టాపిక్ గా నిలిచాడు.
*దక్షిణాదిలో ట్విట్టర్ లో ట్రెండ్ లో నిలిచినా టాప్ హీరోగా కోలీవుడ్ స్టార్ హీరోగా విజయ్ నిలిచారు. మాస్టర్ సినిమాతో పాటు బీస్ట్ అప్డేట్స్ తో విజయ్ పేరు ట్విట్టర్ లో ఎక్కువగా ట్రెండ్ అయ్యారు. ఇక విజయ్ కి తెలుగులో కూడా మంచి ఫన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే..
Also Read: బొప్పాయి పండులో బుల్లి ఆకృతిలో బొజ్జగణపయ్య.. మండపంలో ఉంచి పూజలు