Happy Birthday Venkatesh : వెంకీకి వెరైటీ‌గా బర్త్ డే విషెస్ చెప్పిన ‘ఎఫ్ 3’ టీమ్

కుర్ర హీరోలకు పోటీ ఇవ్వడంలో ముందుండే సీనియర్ హీరో ఎవరంటే టక్కున చెప్పే పేరు.. విక్టరీ వెంకటేష్. ఏమాత్రం తగ్గని ఎనర్జీతో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు వెంకీ.

Happy Birthday Venkatesh : వెంకీకి వెరైటీ‌గా బర్త్ డే విషెస్ చెప్పిన 'ఎఫ్ 3' టీమ్
Venkatesh
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 13, 2021 | 11:52 AM

Venkatesh : కుర్ర హీరోలకు పోటీ ఇవ్వడంలో ముందుండే సీనియర్ హీరో ఎవరంటే టక్కున చెప్పే పేరు.. విక్టరీ వెంకటేష్. ఏమాత్రం తగ్గని ఎనర్జీతో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు వెంకీ. సోలో హీరోగానే కాకుండా కుర్రహీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాలు కూడా చేస్తున్నాడు. నేడు ఈ విక్టరీ హీరో పుట్టిన రోజు. నేటితో 61 వ పడిలోకి అడుగుపెట్టాడు వెంకీ. కలియుగ పాండవులు సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు వెంకటేష్. ఇప్పటివరకు వెంకీ 74 సినిమాల్లో నటించారు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టి ఫుల్ బిజీగా ఉన్నాడు వెంకటేష్. సంవత్సరానికి రెండు మూడు సినిమాలను ప్రేక్షకులకు అందించిన హీరోల్లో ముందువరసలో ఉన్నారు వెంకీ. ఆయన నటించిన సినిమాలన్నీ దాదాపు ప్రేక్షకులను ఆకట్టుకొని సూపర్ హిట్స్ గా నిలిచినవే..

1987లో ఏకంగా ఐదు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు వెంకీ. ఆతర్వాత 1988, 89, 91,96 సంవత్సరాల్లో ఏడాదికి నాలుగు సినిమాలు చేసి రికార్డు క్రియేట్ చేశారు వెంకటేష్. ఇక ఇటీవలే నారప్ప, దృశ్యం 2 సినిమాలతో హిట్స్ అందుకున్నారు. నేడు వెంకీ పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా ఆయనకు పుట్టిన రోజు శుభాకంక్షలు తెలుపుతున్నారు. ఆయన నటిస్తున్న సినిమాలనుంచి పోస్టర్లు, టీజర్లను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం వెంకీ ఎఫ్ 3 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో వచ్చిన ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా వెంకీకి బర్త్ డే విషెస్ చెప్తూ.. ఓ చిన్న వీడియోను విడుదల చేశారు మేకర్స్..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Victrina Wedding: నెట్టింట్లో వైరలవుతోన్న విక్ట్రీనా వెడ్డింగ్‌ వీడియో.. రాజమహల్‌ను తలపిస్తోన్న హోటల్‌..

Jr NTR: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రమోషన్లలో తారక్‌ వాచ్‌ చూశారా?.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు..

Pushpa MASSive Pre Release Party: బన్నీ పడే కష్టానికి, డైరెక్టర్ మీద పెట్టె నమ్మకానికి హ్యాట్సాఫ్ : రాజమౌళి