Sweden Prime Minister: స్వీడన్ పార్లమెంట్‌లో విశ్వాసం కోల్పోయిన ప్రధాని.. తన పదవికి రాజీనామా

స్వీడన్ ప్రధాని స్టీఫెన్ లోఫ్‌వెన్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. గ‌త వారం ఆ దేశ‌ పార్లమెంటులో స్టీఫెన్‌కు వ్యతిరేకంగా ప్రవేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది.

Sweden Prime Minister: స్వీడన్ పార్లమెంట్‌లో విశ్వాసం కోల్పోయిన ప్రధాని.. తన పదవికి రాజీనామా
Sweden Prime Minister Stefan Lofven Resigns
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 28, 2021 | 4:22 PM

Sweden Prime Minister Stefan Lofven resigns: స్వీడన్ ప్రధాని స్టీఫెన్ లోఫ్‌వెన్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. గ‌త వారం ఆ దేశ‌ పార్లమెంటులో స్టీఫెన్‌కు వ్యతిరేకంగా ప్రవేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఆయన రాజీనామా చేయడానికి వారం రోజుల సమయం ఇచ్చారు. దీంతో అనుహ్యంగా ఆయ‌న త‌న‌ పదవి వదులుకున్నారు. నేటికి వారం రోజుల గ‌డువు పూర్తి కావ‌డంతో స్టీఫెన్ త‌న ప‌ద‌వికి రాజీనామా స‌మ‌ర్పించారు. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవ‌డంలో విఫ‌ల‌మై ప‌ద‌విని పోగొట్టుకున్న తొలి స్వీడ‌న్ ప్రధానిగా ఆయ‌న అప‌ఖ్యాతి మూట‌గ‌ట్టుకున్నారు. ఈ నేప‌థ్యంలో ప్రస్తుతం మ‌రో వ్యక్తిని ప్రధానిగా ఎంపిక చేసుకుని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ‌డ‌మా..? లేదంటే ఎన్నికలకు వెళ్లాడ‌మా..? అనే విషయంలో స్వీడన్ పార్లమెంట్ స్పీకర్ ఆండ్రియాస్ నార్లెన్ నిర్ణయం తీసుకోనున్నారు.

కొత్తగా నిర్మించిన అపార్ట్‌మెంట్లకు అద్దె నియంత్రణలను తగ్గించే ప్రణాళిక విషయంలో ప్రభుత్వానికి, దానికి మద్దతు ఇస్తున్న లెఫ్ట్ పార్టీకి మధ్య విభేదాలు వెలగుచూశాయి. దీంతో అది ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. ప్రధానిగా స్టీఫెన్ లోఫ్‌వెన్ పదవికి అనర్హుడుగా ప్రకటించాలని లెఫ్ట్ పార్టీ డిమాండ్ చేసింది. దీన్ని అవకాశంగా మలుచుకున్న నేషనలిస్ట్ స్వీడన్ డెమోక్రాట్‌లు పార్లమెంటులో ప్రధానిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ‌పెట్టారు. మొత్తం 349 సీట్లు ఉన్న స్వీడ‌న్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 181 మంది చట్టసభ్యులు ఓటేశారు. జూన్ 21న పార్లమెంట్‌లో ప్రధాని స్టీఫెన్ విశ్వాసాన్ని కోల్పోయారు. ఆయన పదవికి రాజీనామా చేసేందుకు పార్లమెంట్ స్వీకర్ వారం రోజులు సమయం ఇచ్చారు. నేటితో వారం రోజుల గడువు పూర్తవ్వడంతో ఆయన తన రాజీనామాను సమర్పించారు.

ఇదిలావుంటే, స్పీకర్ ఆండ్రియాస్ నార్లెన్ ఇప్పుడు చట్టసభ సభ్యుల నుండి తగినంత మద్దతుతో కొత్త ప్రధానిని కనుగొనటానికి ప్రయత్నాలు చేయనున్నారు. అతను విఫలమైతే, 2022 సెప్టెంబరులో జరగనున్న ఎన్నికలను ఒక సంవత్సరం కన్నా ముందుగానే ఎన్నికలకు ఆదేశించవచ్చు. కాగా, 2018 నుండి ప్రధాని స్టీఫెన్.. మైనారిటీ సంకీర్ణానికి నాయకత్వం వహించారు. అధికారంలో ఉండటానికి రెండు చిన్న పార్టీలతో పాటు వామపక్షాల మద్దతుపై ఆధారపడ్డారు. దీంతో ప్రధానిగా కొనసాగారు.

Read Also.. 12వ శతాబ్దంలో మట్టితో క‌ట్టిన‌ గుండ్రటి అపార్ట్‌మెంట్లు.. విపత్తులు సైతం తట్టుకుంటున్న వైనం.. ఇప్ప‌టి ఇంజ‌నీర్లు షాక్

తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా