Twitter: ట్విట్టర్ కొత్త సాహసం.. జమ్మూ, కాశ్మీర్, లడఖ్ లను ఇండియా నుంచి వేరు చేసి మ్యాప్..మండిపడుతున్న నెటిజన్లు
Twitter: ఇప్పటికే భారత ప్రభుత్వంతో ఘర్షణ పూరితంగా వ్యవహరిస్తున్న ట్విట్టర్ మరోసారి తీవ్రంగా ఇండియాను అవమానించే పని చేసింది.
Twitter: ఇప్పటికే భారత ప్రభుత్వంతో ఘర్షణ పూరితంగా వ్యవహరిస్తున్న ట్విట్టర్ మరోసారి తీవ్రంగా ఇండియాను అవమానించే పని చేసింది. తన ట్విట్టర్ లొకేషన్ మ్యాప్ లో భారతదేశం నుంచి జమ్మూ, కాశ్మీర్, లడఖ్ లను వేరుగా చూపిస్తో మ్యాప్ మార్చి చూపిస్తోంది. ఈ మూడు భూభాగాలు కలిపి ఒకటి.. మిగిలిన ఇండియా ఒకటిగా రెండు భూ భాగాలు వేర్వేరుగా తన మ్యాప్ లో కొత్తగా మార్పు చేసింది. మీడియా కథనాల ప్రకారం ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ విషయంపై ట్విట్టర్ కు నోటీసు ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
కొన్నిరోజులుగా ట్విట్టర్-కేంద్రప్రభుత్వం మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనివున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఆర్టీ చట్టానికి ట్విట్టర్ తన ఆమోదాన్ని తెలపాల్సి ఉంది. ఆ విషయంలో ఇప్పటివరకూ సమాధానం ఇవ్వలేదు. ఫిబ్రవరి 2021 నుండి ట్విట్టర్, ప్రభుత్వం మధ్య గొడవ ముదిరింది. ఫిబ్రవరిలో ప్రభుత్వం 1178 పేర్ల జాబితాను ట్విట్టర్‌కు అందచేసింది. ఈ ట్విట్టర్ హ్యాండిల్స్ శాంతిభద్రతలకు సమస్యలను కలిగిస్తున్నాయని, అందువల్ల వాటిని వెంటనే ఆపాలని ప్రభుత్వం తెలిపింది. ఆర్డర్ పాటించకపోతే, ఐటి యాక్ట్ 69 ఎ కింద చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ప్రభుత్వ ఈ ఉత్తర్వు ట్విట్టర్‌పై ఎలాంటి ప్రభావం చూపలేదు.
ఈ నేపధ్యంలో మే 18 న బీజేపీ ప్రతినిధి సంబిత్ పత్రా స్క్రీన్ షాట్ ను ట్వీట్ చేసి కాంగ్రెస్ టూల్ కిట్ అని పిలిచారు. మే 20 న ట్విట్టర్ దీనిని ‘మానిప్యులేటెడ్ మీడియా’ అని ట్యాగ్ చేసింది. ప్రభుత్వం చెప్పినప్పటికీ, దానిని తొలగించలేదు.
మే 25 న గురుగ్రామ్‌లోని ట్విట్టర్ కార్యాలయంపై పోలీసులు దాడి చేశారు. టూల్‌కిట్ కేసులో పోలీసులు విచారణ నోటీసును ఇచ్చారు. జూన్ 4 న, ట్విట్టర్ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సహా అనేక మంది వ్యక్తుల ఖాతాల నుండి నీలిరంగు గుర్తింపులను తొలగించారు. అయితే, తరువాత వాటిని పునరుద్ధరించింది ట్విట్టర్. తాజాగా భారత న్యాయ, ఐటి మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖాతాను ఒక గంట పాటు ట్విట్టర్ శుక్రవారం బ్లాక్ చేసింది.
ఇన్ని ఉద్రిక్తల నేపధ్యంలో ట్విట్టర్ చేసిన ఈ పని మరింత వేడిని రాజేస్తోంది. ఇప్పటికే ట్విట్టర్ చేసిన ఈ పని సోషల్ మీడియాలో హోరెత్తుతోంది. ట్విట్టర్ వినియోగదారులు ఈ మ్యాప్ ను షేర్ చేసి ట్విట్టర్ తప్పును వేలెత్తి చూపిస్తున్నారు. ట్విట్టర్ ఈ చర్యను సోషల్ మీడియాలో మొదటిసారి @thvaranam అనే వినియోగదారు గుర్తించారు. అప్పటి నుండి, ట్విట్టర్ విడుదల చేసిన భారతదేశం మ్యాప్ యొక్క ఫోటో వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ 28 జూన్ 2021 న ఉదయం 10:38 గంటలకు భాగస్వామ్యం చేయబడింది. ఇది ట్విట్టర్ కెరీర్ పేజీలో భారతదేశ పటంలో ఉన్న లోపాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ఆ ట్వీట్ మీరూ ఇక్కడ చూడొచ్చు.
.@OpIndia_com @UnSubtleDesi @rahulroushan @SwarajyaMag @TVMohandasPai @ARanganathan72 https://t.co/rBE10OlTer
— acceleration (@thvaranam) June 28, 2021
Also Read: Twitter Story: ట్విట్టర్ మొండి పట్టుదలకు కారణం ఏమిటి? ఎందుకు భారత ప్రభుత్వం మాట లెక్కచేయడం లేదు?
Central Twitter: ట్విటర్‌కు కేంద్ర ప్రభుత్వం చివరి వార్నింగ్.. నిబంధనలు పాటించకపోతే తీవ్ర పరిణామాలు