Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sunita Williams: సునీతా విలియమ్స్ రాక ఆలస్యమెందుకు.? ఫిబ్రవరిలోనైనా తిరిగొస్తారా..! పూర్తి వివరాలు

స్టార్‌లైనర్ స్పేస్‌లోకి వెళ్లేందుకు సిద్ధమైంది. అక్కడి ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌లో 8 రోజుల పాటు గడిపి కీలక పరిశోధనలు చేసి వెనక్కి వచ్చేయాలి. ఇదీ నాసా అసలు మిషన్. ఇందుకోసం ఇద్దరు ఆస్ట్రోనాట్స్‌ని సిద్ధం చేసింది. వాళ్లలో ఒకరు సునీతా విలియమ్స్ కాగా..మరొకరు బచ్ విల్మోర్. ఇద్దరూ సక్సెస్‌ఫుల్‌గానే అక్కడికి వెళ్లారు.

Sunita Williams: సునీతా విలియమ్స్ రాక ఆలస్యమెందుకు.?  ఫిబ్రవరిలోనైనా తిరిగొస్తారా..! పూర్తి వివరాలు
Astronaut Sunita WilliamsImage Credit source: NASA
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 01, 2025 | 8:30 PM

స్టార్‌లైనర్ స్పేస్‌లోకి వెళ్లేందుకు సిద్ధమైంది. అక్కడి ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌లో 8 రోజుల పాటు గడిపి కీలక పరిశోధనలు చేసి వెనక్కి వచ్చేయాలి. ఇదీ నాసా అసలు మిషన్. ఇందుకోసం ఇద్దరు ఆస్ట్రోనాట్స్‌ని సిద్ధం చేసింది. వాళ్లలో ఒకరు సునీతా విలియమ్స్ కాగా..మరొకరు బచ్ విల్మోర్. ఇద్దరూ సక్సెస్‌ఫుల్‌గానే అక్కడికి వెళ్లారు. ఏ లక్ష్యం అయితే పెట్టుకున్నారో అది సాధించారు. ఇక అంతా సర్దేసుకుని వెనక్కి వచ్చేయడమే అనుకున్నారు. సరిగ్గా అప్పుడే బోయింగ్ స్టార్‌లైనర్‌లో టెక్నికల్ గ్లిచ్ వచ్చింది. వెంటనే సరైపోతుందిలే అని వెయిట్ చేశారు. వాళ్లు అలా నిరీక్షించబట్టి ఇప్పటికి 8 నెలలవుతోంది. ఇంత వరకూ ఏ మాత్రం పురోగతి లేదు. ఇదిగో వచ్చేస్తారు..అదిగో వచ్చేస్తారు అని ప్రకటనలు తప్ప అవేవీ నిజం కాలేదు. అంటే సుమారు 8 నెలలుగా వాళ్లు అలా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లోనే చిక్కుకుపోయారు. ఆహారం, వైద్యంతో పాటు ఇతరత్రా సాయాలు అందుతూనే ఉన్నాయి. కానీ..వాళ్లు వెనక్కి వచ్చే మార్గమే తోచకుండా ఉంది. అయితే…అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్…ఈ బోయింగ్ స్టార్‌లైనర్‌ని వెనక్కి తీసుకు రావాలని ఎలన్ మస్క్‌ని రిక్వెస్ట్ చేశారు. అప్పటి నుంచి మరోసారి స్టార్‌లైనర్‌పై డిబేట్ మొదలైంది.

ఇప్పుడంతా ఆలోచించేదేంటంటే..అసలు వీళ్లను వెనక్కి తీసుకురావడం ఎలా అని. అయితే ట్రంప్..మస్క్‌ని రిక్వెస్ట్ చేసిన తరవాత నాసా స్పందించింది. స్పేస్‌ ఎక్స్‌తో కలిసి వీలైనంత త్వరగా వాళ్లని భూమిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు క్లియర్‌గా ఓ స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఇందుకోసం ప్రత్యేకంగా Crew-10 ని లాంఛ్ చేసేందుకూ సిద్ధమవుతున్నట్టు వెల్లడించింది. నిజానికి ఫిబ్రవరి నాటికే సునీతా విలియమ్స్‌, బచ్ విల్మోర్ భూమిపైకి వచ్చేస్తారని ముందుగా ప్రకటించారు. కానీ..నాసా అఫీషియల్‌గా ఇచ్చిన స్టేట్‌మెంట్ మాత్రం వేరుగా ఉంది. బహుశా వాళ్లను వెనక్కి తీసుకురావడానికి ఇంకాస్త సమయం పడుతుండొచ్చని, మార్చి నెలలో ఇది జరిగే అవకాశముందని ప్రకటించింది. అసలు ఎందుకింత ఆలస్యం అవుతోందో కూడా నాసా వివరిస్తోంది. బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో భద్రతా ప్రమాణాల్లో తలెత్తిన లోపాల వల్లే ఇలా జరుగుతోందని వెల్లడించింది. ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ని..స్పేస్ స్టేషన్‌కి ఆస్ట్రోనాట్స్‌ని పంపించేందుకు ప్రత్యేకంగా తయారు చేశారు. అయితే..తీరా స్పేస్‌లోకి వెళ్లాక అక్కడ టెక్నికల్ సమస్యలు వచ్చాయి. ఫలితంగా అక్కడే వ్యోమగాములు చిక్కుకుపోయారు. మరి ఇన్ని రోజులు అక్కడే ఉంటే..ఆస్ట్రోనాట్స్‌కి ఏమీ కాదా..? వాళ్ల ఆరోగ్య పరిస్థితేంటి..?

స్పేస్‌లో వాతావరణానికి ఇక్కడి వాతావరణానికి చాలా తేడా ఉంటుంది. అయితే..అక్కడి క్లైమేట్‌కి తట్టుకుని ఉండగలిగేలా ముందుగానే ఆస్ట్రోనాట్స్‌కి ట్రైనింగ్ ఇస్తారు. కానీ…కొద్ది రోజుల వరకూ అంటే మేనేజ్ చేసేయొచ్చు. మరి ఇలా నెలల తరబడి ఉన్నప్పుడు వాళ్లు ఎలా సేఫ్‌గా ఉంటారు..? వాళ్ల శరీరంలో మార్పులు రావా అన్న డౌట్స్ కూడా మొదలయ్యాయి. ఈ డౌట్స్‌తో పాటు హ్యూమన్ మిషన్స్‌ని చేపట్టినప్పుడు స్పేస్‌లో ఇలాంటి సమస్యలు వస్తే..ఎలా సస్టైన్ అవుతారన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. అంటే..ఇదంతా ఇన్‌డైరెక్ట్‌గా స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్‌పైనే ఆందోళనలు రేకెత్తించే ప్రమాదముంది. అయితే..ఇక్కడ సునీతా విలియమ్స్ ఇచ్చిన స్టేట్‌మెంట్ గురించి మాట్లాడుకోవాలి. ఇన్ని నెలల పాటు స్పేస్‌లో ఉండిపోయి..అసలు నడవడం అంటే ఏంటో మర్చిపోయా అన్నారామె. స్పేస్‌లో జీరో గ్రావిటీ ఉంటుంది. అంటే అందరూ గాల్లో తేలుతుంటారు. ఇలా నెలల పాటు ఉండిపోవడం వల్ల అలాంటి పరిస్థితిలోకి వెళ్లిపోయారు.

ఇవి కూడా చదవండి

ఇక సునీతా విలియమ్స్ ఆరోగ్యంపైనా రకరకాల వార్తలు వచ్చాయి. ఆమె ఆరోగ్యం ఏమీ బాగోలేదని, బరువు తగ్గిపోయారని ప్రచారం జరిగింది. అయితే..ఇవన్నీ రూమర్స్ అని స్వయంగా సునీతా విలియమ్స్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. స్పేస్‌లో వెయిట్ ట్రైన్‌ ఎక్విప్‌మెంట్‌ని వినియోగిస్తున్నానని, తనకు ఎలాంటి ఇబ్బంది లేదని వెల్లడించారు. అయితే..ఇప్పుడు ఈ వ్యోమగాములను భూమిపైకి తీసుకొచ్చేందుకు..నాసా..స్పేస్ ఎక్స్ సంస్థ సాయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. Crew Dragon స్పేస్‌క్రాఫ్ట్ ద్వారా ఈ మిషన్ చేపట్టనుంది. అయితే…ఈ స్పేస్‌క్రాఫ్ట్ లాంఛింగ్ మార్చి నెల వరకూ జరిగే అవకాశాలు కనిపించడం లేదు. చాలా విధాలుగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు నాసా చెబుతోంది. అయితే..ఇన్ని సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ…అక్కడి రీసెర్చ్ ఆగిపోలేదని నాసా స్టేట్‌మెంట్ ఇచ్చింది. రకరకాల ప్రయోగాలతో పాటు స్పేస్‌ వాక్స్‌కీ సిద్ధమవుతున్నారని తెలిపింది. పైగా..అక్కడి సిబ్బందికి ప్రయోగాలపై ఫోకస్ చేసేందుకు ఎక్కువ టైమ్‌ దొరికినట్టైందని వివరిస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి