Kartarpur Sahib: గురుద్వారాలో ఫొటోషూట్.. విమర్శలతో దిగొచ్చిన పాకిస్తాన్ మోడ‌ల్.. క్షమించాలంటూ..

Shaik Madarsaheb

Shaik Madarsaheb |

Updated on: Nov 30, 2021 | 12:21 PM

Pakistani model Sauleha: పాకిస్తాన్‌కు చెందిన ఓ మోడల్ సిక్కు మ‌త‌స్థుల‌ను అవ‌మానించే రీతిలో ప్రవర్తించి వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. సిక్కులు అత్యంత పవిత్రంగా భావించే

Kartarpur Sahib: గురుద్వారాలో ఫొటోషూట్.. విమర్శలతో దిగొచ్చిన పాకిస్తాన్ మోడ‌ల్.. క్షమించాలంటూ..
Pakistani Model Sauleha

Pakistani model Sauleha: పాకిస్తాన్‌కు చెందిన ఓ మోడల్ సిక్కు మ‌త‌స్థుల‌ను అవ‌మానించే రీతిలో ప్రవర్తించి వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. సిక్కులు అత్యంత పవిత్రంగా భావించే క‌ర్తార్‌పూర్‌ కారిడార్‌లోని గురుద్వారా ద‌ర్బార్ సాహిబ్‌లో పాక్ మోడ‌ల్ సౌలేహ ఫోటో షూట్ నిర్వహించింది. అక్కడ ఫోజులిచ్చిన ఫోటోల‌ను ఆమె సోష‌ల్ మీడియాలో పోస్టు చేయడంతో సిక్కు సంఘాలు ఆమెపై ఆగ్రహం వ్యక్తంచేశాయి. కనీసం త‌ల‌పై దుప‌ట్టా వస్త్రం లేకుండా గురుద్వారాలో తిర‌గ‌డం సిక్కు మతస్థుల మ‌నోభావాల‌ను కించ‌ప‌ర‌చ‌డ‌మే అంటూ శిరోమ‌ణి అకాలీ ద‌ళ్, సహా పలు పార్టీల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే.. మన్నత్ క్లాతింగ్ బ్రాండ్ కోసం సౌలేహ క‌ర్తార్‌పూర్‌లో ఫోటోషూట్ నిర్వహించింది. తాము ఎంతో పవిత్రంగా భావించే స్థలంలో మీరు యాడ్‌ షూట్‌ చేస్తారా.. ఇదేమైనా పిక్నిక్‌ స్పాట్ అనుకుంటున్నారా అంటూ మండిపడుతున్నారు.

మోడల్ సౌలేహపై చర్యలు తీసుకోవాలని శిరోమణి అకాళీ దల్‌ అధికార ప్రతినిధి, ఢిల్లీ సిక్కు గురుద్వారా కమిటీ చీఫ్ మంజిందర్ సింగ్ సిర్సా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను డిమాండ్ చేశారు. దీంతోపాటు పాక్ మోడ‌ల్ సౌలేహకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో సిక్కు మతస్థులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ క్రమంలో పాక్ మోడ‌ల్ సౌలేహ క్షమాపణలు చెప్పింది. ఎవ‌రి మ‌నోభావాల‌ను కించ‌ప‌ర‌చ‌డం త‌న ఉద్దేశం కాద‌ని.. తనను క్షమించాలంటూ కోరింది. కార్తాపూర్ కారిడార్‌ దర్శించుకున్న సందర్బంగా.. జ్ఞాపకంగా తాను ఫోటోలు తీసుకున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ఇన్‌స్టాలో ఆమె పోస్ట్ చేసింది. తాను చరిత్ర, సిక్కు సమాజం గురించి తెలుసుకోవడానికి కర్తార్‌పూర్‌కి వెళ్లినట్లు పేర్కొంది. ఎవరి మనోభావాలను దెబ్బతీయడానికి ఇలా చేయలేదని.. ఎవరినైనా బాధపెట్టినట్లయితే క్షమించండి అంటూ పేర్కొంది.

అయితే.. గురుద్వారాకు వెళ్లిన వారు క‌చ్చితంగా త‌మ త‌ల‌పై ఏదైనా వ‌స్త్రాన్ని ధ‌రించాల్సి ఉంటుంది. ఆమె అలాకాకుండా ఫోటో షూట్‌ నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. కాగా.. పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్‌లో ఉన్న గురుద్వారా దర్బార్‌ సాహిబ్‌ సిక్కులకు పవిత్ర పుణ్యక్షేత్రం. పాక్‌ పంజాబ్‌ ప్రావిన్స్‌లోని రావి నది ఒడ్డున ఉన్న కర్తార్‌పూర్‌ సాహిబ్‌ గురుద్వారా క్షేత్రం.. భారత సరిహద్దు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్‌ దేవ్‌ తుది మజిలీ ఈ ప్రాంతంలో జరిగింది. గురునానక్ దేవ్ తన జీవితంలో చివరి 18 సంవత్సరాలు ఇక్కడ గడిపారు. కావున ఈ ప్రాంతాన్ని సిక్కులు అత్యంత పవిత్ర ప్రాంతంగా కొలుస్తారు.

Also Read:

Watch Video: డెంజరస్ యాక్సిడెంట్.. మద్యం మత్తులో దూసుకొచ్చి చంపారు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

Jai Bhim: మరో ఘనత అందుకున్న జై భీమ్‌.. అంతర్జాతీయ అవార్డుకు నామినేట్‌ అయిన సూర్య సినిమా..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu