Jai Bhim: మరో ఘనత అందుకున్న జై భీమ్.. అంతర్జాతీయ అవార్డుకు నామినేట్ అయిన సూర్య సినిమా..
తమిళ హీరో సూర్య నటించిన తాజా చిత్రం 'జై భీమ్'. ఆయనతో పాటు ఆయన సతీమణి జ్యోతిక కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. అమెజాన్ ప్రైమ్ వేదికగా నవంబర్ 2న ఈ సినిమా విడుదలైంది.
తమిళ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘జై భీమ్’. ఆయనతో పాటు ఆయన సతీమణి జ్యోతిక కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. అమెజాన్ ప్రైమ్ వేదికగా నవంబర్ 2న ఈ సినిమా విడుదలైంది. సమాజంలోని అస్పృశ్యత, అంటరానితనాన్ని ప్రశ్నిస్తూ నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు సినీ అభిమానుల మన్ననలు అందుకుంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో పాటు పలువురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు ‘జై భీమ్’ సినిమాను వీక్షించి ప్రశంసలు కురిపించారు. ఇక ఈ సినిమా ఐఏమ్‌డీబీలో అత్యధికంగా 9.6 రేటింగ్ సాధించి ప్రపంచ రికార్డు సృష్టించింది. తాజాగా సూర్య మూవీ ఓ అంతర్జాతీయ పురస్కారానికి నామినేట్ అయింది.
గోల్డెన్ గ్లోబ్… అంతర్జాతీయ చలనచిత్ర రంగంలో ఆస్కార్ అవార్డు తర్వాత అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ పురస్కారాన్ని భావిస్తారు. ఈ క్రమంలో ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో గోల్డెన్ గ్లోబ్ పురస్కారానికి నామినేట్ అయింది ‘జై భీమ్’. వచ్చే ఏడాది జనవరిలో లాస్ ఏంజెల్స్ వేదికగా ఈ అవార్డులను అందించనున్నారు. కాగా ‘జై భీమ్’ గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు షార్ట్‌లిస్ట్ కావడంతో సినీ అభిమానులు సూర్యను అభినందిస్తున్నారు. కాగా ఈ సినిమాకు ఆస్కార్ పురస్కారం పొందే అర్హత ఉందని ములుగు ఎమ్మెల్యే సీతక్కతో పాటు పలువురు ప్రముఖులు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
Also Read:
Puneeth Rajkumar: నా సోదరుడి మరణం ఒక ప్రశ్నలా మిగిలిపోయింది.. పునీత్ రాఘవేంద్ర భావోద్వేగం..
Malavika Mohanan: షూటింగ్‌లో గాయపడిన మాస్టర్ హీరోయిన్.. ఫొటోలు వైరల్..
Pushpa: పుష్పరాజ్‌కు బాహుబలి సపోర్ట్.. పుష్ప ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా డార్లింగ్.?