AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa: పుష్పరాజ్‌కు బాహుబలి సపోర్ట్‌.. పుష్ప ప్రి రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా డార్లింగ్‌.?

Pushpa: ఒక హీరో సినిమాకు సంబంధించిన వేడుకల్లో మరో హీరో పాల్గొనడం ఇటీవల ఒక ట్రెండ్‌లా మారుతోంది. ఒకప్పుడు పెద్దగా ఈ సంస్కృతి లేకపోయినప్పటికీ ఇటీవల ఎక్కువైంది. స్టార్ హీరోలు తమ...

Pushpa: పుష్పరాజ్‌కు బాహుబలి సపోర్ట్‌.. పుష్ప ప్రి రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా డార్లింగ్‌.?
Pushpa Prabhas
Narender Vaitla
| Edited By: |

Updated on: Nov 30, 2021 | 5:13 PM

Share

Pushpa: ఒక హీరో సినిమాకు సంబంధించిన వేడుకల్లో మరో హీరో పాల్గొనడం ఇటీవల ఒక ట్రెండ్‌లా మారుతోంది. ఒకప్పుడు పెద్దగా ఈ సంస్కృతి లేకపోయినప్పటికీ ఇటీవల ఎక్కువైంది. స్టార్ హీరోలు తమ హోదాను, స్టార్‌డమ్‌ను సైతం పక్కన పెట్టి తోటి హీరోల కోసం రంగంలోకి దిగుతున్నారు. దీంతో ఎక్కడలేని ప్రచారం జరుగుతోంది. ఇటీవల బాలకృష్ణ నటించిన అఖండ ప్రి రిలీజ్‌ ఈవెంట్‌కు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ముఖ్యత అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం బన్నీ కోసం ప్రభాస్‌ రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప’ అనే చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. రష్మిక హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ అనే వినూత్న కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఇండస్ట్రీ దృష్టి పడింది. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను డిసెంబర్‌ 17న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్‌ సినిమా ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచేసింది. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు టీజర్‌, పాటలతో హోరెత్తించిన చిత్ర యూనిట్‌ తాజాగా.. ప్రి రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే డిసెంబర్‌ 12న హైదరాబాద్‌లో ఈవెంట్‌ను భారీగా నిర్వహించేందుకు సన్నాహాలు మొదలయ్యాయని సమాచారం.

ఇదిలా ఉంటే ఈ ఈవెంట్‌కు ప్రభాస్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే చిత్ర యూనిట్‌ ప్రభాస్‌ను ఆహ్వానించగా దానికి డార్లింగ్‌ ఓకే చెప్పినట్లు టాక్‌. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ప్రభాస్‌కు ఇప్పటికే బాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్‌ పెరిగిన విషయం తెలిసిందే. ఇక పుష్ప కూడా హిందీలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ ఈ ఈవెంట్‌కు హాజరైతే సహజంగానే పుష్పకు బాలీవుడ్‌లోనూ మంచి ప్రమోషన్‌ జరిగినట్లు ఉంటుందని చిత్ర యూనిట్‌ భావిస్తుందని వార్తలు వస్తున్నాయి.

Also Read: Corona Virus: ఈ రెండేళ్లలో కరోనా రక్కసికి చిక్కిన భారత సైన్యం ఎంతమందో తెలుసా.. లెక్కలు చెప్పిన రక్షణ మంత్రి..

Omicron Alert: ఆ దేశాల నుంచి వచ్చేవారు కచ్చితంగా ఈ రూల్స్ పాటించాల్సిందే.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు

Horoscope Today: ఈరోజు ఈ రాశి ఉద్యోగులకు గుడ్ న్యూస్.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు