AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malavika Mohanan: షూటింగ్‌లో గాయపడిన మాస్టర్‌ హీరోయిన్‌.. ఫొటోలు వైరల్..

రజనీకాంత్‌ నటించిన 'పేట' చిత్రంతో వెండితెరకు పరిచయమైంది కేరళ కుట్టీ మాళవికా మోహనన్‌. తద్వారా మొదటి సినిమాలోనే సూపర్‌ స్టార్‌తో స్ర్కీన్‌ షేర్‌ చేసుకునే అవకాశం దక్కించుకుంది.

Malavika Mohanan: షూటింగ్‌లో గాయపడిన మాస్టర్‌ హీరోయిన్‌.. ఫొటోలు వైరల్..
Basha Shek
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 30, 2021 | 5:13 PM

Share

రజనీకాంత్‌ నటించిన ‘పేట’ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది కేరళ కుట్టీ మాళవికా మోహనన్‌. తద్వారా మొదటి సినిమాలోనే సూపర్‌ స్టార్‌తో స్ర్కీన్‌ షేర్‌ చేసుకునే అవకాశం దక్కించుకుంది. ఆతర్వాత ‘మాస్టర్‌’ సినిమాతో మరో స్టార్‌ హీరో విజయ్‌తో జత కలిసింది. ఇప్పుడు కోలీవుడ్‌ మరో స్టార్‌ హీరో ధనుష్‌ పక్కన ‘మారన్‌’లో నటిస్తోంది. దీంతో పాటు రవి ఉడయార్‌ దర్శకత్వంలో సిద్ధార్థ్‌ చతుర్వేది హీరోగా నటిస్తున్న ‘యుత్ర’ లో మాళవికా హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ మూవీ షూటింగ్‌లో భాగంగా ప్రస్తుతం కొన్ని యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరిస్తున్నాను. కాగా ఈ సినిమా షూటింగ్‌లో గాయపడినట్లు సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది మాళవిక.

తన చేతికి, కాలికి దెబ్బలు తగిలిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఆమె.. ‘మీరు యాక్షన్‌ సినిమా షూటింగుల్లో పాల్గొన్నప్పుడు ఇలాంటి చిన్న గాయాలు తగులుతుంటాయి’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని, మళ్లీ షూటింగ్‌ స్పాట్‌లో కనిపించాలని అభిమానులు కోరుతూ కామెంట్లు పెడుతున్నారు. కాగా తమిళం, మలయాళంతో పాటు కొన్ని రోజుల క్రితం హిందీలో విడుదలైన వెబ్‌సిరీస్‌ ‘మసాబా మసాబా’లోనూ ఓ చిన్న పాత్రలో నటించింది మాళవిక. సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉండే ఆమె నిత్యం తన ఫ్యాషనబుల్‌ ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటోంది.

Also Read:

Pushpa: పుష్పరాజ్‌కు బాహుబలి సపోర్ట్‌.. పుష్ప ప్రి రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా డార్లింగ్‌.?

Spider Man No Way Home: యూఎస్‌ కంటే ముందుగా భారత్‌లోనే ల్యాండ్ కానున్న స్పైడర్‌ మ్యాన్‌.. విడుదల ఎప్పుడంటే..

A. R. Rahman: సంగీత దిగ్గజం కీర్తి కిరీటంలో మరో కలికితురాయి.. అంతర్జాతీయ పురస్కారం అందుకున్న ఏ ఆర్‌ రెహమాన్‌..