Spider Man No Way Home: యూఎస్‌ కంటే ముందుగా భారత్‌లోనే ల్యాండ్ కానున్న స్పైడర్‌ మ్యాన్‌.. విడుదల ఎప్పుడంటే..

హాలీవుడ్‌ సినిమాలు, అందులోనూ మార్వెల్‌ చిత్రాలు చూసేవారికి 'స్పైడర్ మ్యాన్' సిరీస్‌ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ సిరీస్‌లో తెరకెక్కిన అన్ని చిత్రాలు సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచాయి

Spider Man No Way Home: యూఎస్‌ కంటే ముందుగా భారత్‌లోనే ల్యాండ్ కానున్న స్పైడర్‌ మ్యాన్‌.. విడుదల ఎప్పుడంటే..
Follow us
Basha Shek

| Edited By: Ravi Kiran

Updated on: Nov 30, 2021 | 5:13 PM

హాలీవుడ్‌ సినిమాలు, అందులోనూ మార్వెల్‌ చిత్రాలు చూసేవారికి ‘స్పైడర్ మ్యాన్’ సిరీస్‌ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ సిరీస్‌లో తెరకెక్కిన అన్ని చిత్రాలు సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచాయి. ముఖ్యంగా ఇందులోని యాక్షన్‌, అడ్వెంచరస్‌ సన్నివేశాలు సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాగా ఈ సిరీస్‌లో వస్తోన్న మరో విజువల్‌ వండర్‌ ‘స్పైడర్‌ మ్యాన్‌: నో వే హోమ్‌’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రతి అప్‌డేట్‌ సినిమాపై అంచనాలను పెంచేసింది. కాగా ఈ సూపర్‌ హీరో సినిమాను డిసెంబర్‌ 17న అమెరికాలో విడుదల చేయనునన్నట్లు గతంలో సోనీ పిక్చర్స్‌ సంస్థ వెల్లడించింది. అయితే తాజాగా మరో క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చింది. అమెరికా కంటే ముందుగా ఇండియాలోనే ఈ స్పైడర్‌ మ్యాన్‌ ల్యాండ్‌ కానున్నట్లు ఆ సంస్థ ట్విట్టర్‌ తెలిపింది.

‘స్పైడర్‌ మ్యాన్‌ , మార్వెల్‌ ఫ్యాన్స్‌తో మేం ఒక ఇంట్రెస్టింగ్‌ విషయాన్ని పంచుకుంటున్నాం. మన అభిమాన సూపర్‌ హీరో స్పైడర్‌ మ్యాన్‌ యూఎస్‌ కంటే ఒకరోజు ముందుగానే ఇండియాలో స్వింగ్‌ చేయనున్నాడు. డిసెంబర్‌ 16న ‘స్పైడర్‌ మ్యాన్‌: నో వే హోమ్‌’ చిత్రాన్ని ఇంగ్లిష్‌, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో చూడండి’ అని సోనీ పిక్చర్స్‌ ఇండియా ట్విట్టర్‌లో తెలిపింది. దీంతో పాటు ఈ సినిమాకు సంబంధించి మరో కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. టామ్‌ హాలండ్‌, జెండయా, విల్లెం డఫె, జేమీ ఫాక్స్‌ తదితరులు ఈ చిత్రంలో నటించారు.

Also Read:

Poorna: డబ్బే కావాలంటే ఎన్ని సినిమాలైనా చేయొచ్చు కానీ.. కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు తెలిపిన పూర్ణ.

A. R. Rahman: సంగీత దిగ్గజం కీర్తి కిరీటంలో మరో కలికితురాయి.. అంతర్జాతీయ పురస్కారం అందుకున్న ఏ ఆర్‌ రెహమాన్‌..

Ranbir and Alia: మరోసారి పెళ్లి వాయిదా వేసుకున్న బాలీవుడ్‌ ప్రేమ పక్షులు.. కారణాలేంటంటే..

ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?