Poorna: డబ్బే కావాలంటే ఎన్ని సినిమాలైనా చేయొచ్చు కానీ.. కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు తెలిపిన పూర్ణ.

Poorna: 2012లో వచ్చిన ‘సీమటపాకాయ్’ చిత్రంతో తెలుగు ఆడియన్స్‌కు పరిచయమైంది అందాల తార పూర్ణ. తొలి సినిమాతోనే తనదైన అందంతో మాయ చేసిన ఈ ముద్దుగుమ్మ...

Poorna: డబ్బే కావాలంటే ఎన్ని సినిమాలైనా చేయొచ్చు కానీ.. కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు తెలిపిన పూర్ణ.
Actress Poorna
Follow us
Narender Vaitla

| Edited By: Ravi Kiran

Updated on: Nov 30, 2021 | 5:13 PM

Poorna: 2012లో వచ్చిన ‘సీమటపాకాయ్’ చిత్రంతో తెలుగు ఆడియన్స్‌కు పరిచయమైంది అందాల తార పూర్ణ. తొలి సినిమాతోనే తనదైన అందంతో మాయ చేసిన ఈ ముద్దుగుమ్మ అనంతరం పలు క్రేజీ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక తాజాగా రియాలిటీ షోలలో అతిథిగా పాల్గొంటూ తెలుగు టీవీ ఆడియన్స్‌కి మరింత చేరువైంది. ఈ క్రమంలోనే సినిమా అవకాశాలను సైతం సొంతం చేసుకుంటోంది. ఇటీవల ఆహా ఓటీటీ వేదికగా విడుదలైన ‘త్రీ రోజెస్’ వెబ్ సిరీస్‌లో తళుక్కుమన్న ఈ చిన్నది నటిగా మంచి మార్కులు కొట్టేసింది.

ఇదిలా ఉంటే పూర్ణ తాజాగా బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘అఖండ’ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పూర్ణ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 2న విడుదలకానున్న నేపథ్యంలో పూర్ణ ఇటీవల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. సెలబ్రిటీలు గురించి మాట్లాడుతూ.. ‘సెలబ్రిటీలు పబ్లిక్‌ ప్రాపర్టీ అని నా ఫీలింగ్‌. ప్రజల వల్లే సెలబ్రిటీలు అవుతాం. వారు పాజిటివ్, నెగిటివ్‌ కామెంట్లు చేస్తుంటారు.. వాటిని నేను ఒకేలా తీసుకుంటాను. నెగెటివ్‌ కామెంట్లు విని నన్ను నేను మార్చుకున్నాను’ అని చెప్పుకొచ్చింది.

ఇక అఖండ చిత్రంలో నటించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పిన పూర్ణ, సినిమాలో ఆమె పాత్ర ఎంతో కీలకమని తెలిపింది. ఇక తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. ‘కేరళ నుంచి తెలుగు ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్లు అయింది. ఇండస్ట్రీకి సింగిల్‌గా వచ్చాను. కానీ ఇంతదాకా ప్రయాణించాను. డబ్బే కావాలంటే ఎన్ని సినిమాలైనా చేయొచ్చు. కెరీర్‌ చాలాకాలం సాగాలంటే మాత్రం మంచి చిత్రాలనే ఎంచుకోవాలి. ముందు నేను కొన్ని తప్పులు చేశాను.. కానీ ఇప్పుడు జాగ్రత్తగా మంచి పాత్రలనే ఎంచుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చింది.

Also Read: Omicron Alert: ఆ దేశాల నుంచి వచ్చేవారు కచ్చితంగా ఈ రూల్స్ పాటించాల్సిందే.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు

Moto g31: మార్కెట్లోకి మోటోరోలా మరో కొత్త స్మార్ట్ ఫోన్.. రూ. 15 వేల లోపు ఆకట్టుకునే ఫీచర్లు ఈ ఫోన్ సొంతం..

Twitter Gets New CEO – Parag Agrawal: భార‌తీయుడికి ట్విట్టర్ పగ్గాలు.. సీఈవోగా పరాగ్ అగర్వాల్ బాధ్యతలు..