AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India US Trade Deal: అమెరికాతో హిస్టారికల్ డీల్! రొయ్య నుంచి రియాల్టీ దాకా.. ఆల్ ఈజ్ వెల్!

నార్త్ డకోటా, మోంటానా. అమెరికాలోని ఈ రెండు రాష్ట్రాలు దారుణమైన నష్టాలు చూశాయి. ఇలా చెబితే ఇంటెన్సిటీ ఉండదేమో. ఘొల్లుమన్నాయి. కింద పడి బొర్లాయి. లబోదిబోమంటూ గుండెలు బాదుకున్నాయి. అర్జెంట్‌గా ట్రంప్‌కు లెటర్ రాసి.. భారత్‌ను ఎలా ఒప్పిస్తారో మాకు తెలీదు.. మోదీని కాస్త జాలి చూపించమనండి అని బోరుమన్నాయి. ట్రంప్‌వి కేవలం అరుపులే కావొచ్చు.. మోదీ పెట్టినవి సైలెంట్ వాతలు. అమెరికా-భారత్ మధ్య ఇంత అర్జెంట్‌గా డీల్ కుదరడానికి.. మోదీ కనిపించకుండా కొట్టిన కొన్ని దెబ్బలు కూడా కారణమే. 'భారత్‌పై ట్రంప్ 50 శాతం టారిఫ్ విధింపు'.. ఈ న్యూసే విన్నాం. కాని, 'అమెరికాపై భారత్ 30 శాతం టారిఫ్'.. ఇది విన్నామా. సైలెంట్‌గా ఏసేశారు మోదీ. నార్త్ డకోటా, మోంటానా ప్రస్తావన ఎందుకంటే.. ఆ రెండు రాష్ట్రాల్లో పప్పు దినుసులు విపరీతంగా పండిస్తారు. మోడీయేమో 30 పర్సెంట్ టారిఫ్ వేశారు. 140 కోట్ల జనం ఉన్న భారత్.. మన పప్పుదినుసులు కొనకపోతే ఎలా అని ట్రంప్ దగ్గర ఏడ్చారు అమెరికా రైతులు. అలా ఉంటుంది భారత్ స్ట్రాటజీ. 140 కోట్ల జనం... ఇదే భారత్‌కు బలం. త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తి మనం. అలాంటి భారత్‌ను టారిఫ్‌లతో లొంగదీసుకోవాలనుకోవడమా..! పైగా ట్రంప్ చూస్తుండగానే.. ప్రపంచ దేశాలతో వరుస డీల్స్ కుదుర్చుకుంటూ వెళ్లారు మోదీ. వెళ్లిన ప్రతిచోటా మనకి లాభమే. పైగా అవి ఫ్రీ-ట్రేడ్ డీల్స్. అయినా అమెరికా చూస్తూనే వచ్చింది. మొన్నటికి మొన్న EUతో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్‌పై సంతకాలు జరిగాయి. ఇక చూస్తూ ఊరుకోలేదు ట్రంప్. దిగొచ్చారు. రండి మనమూ ఒప్పందం చేసుకుందాం అన్నారు. ఇంకా చాలా ఉన్నాయ్ చెప్పుకోడానికి.

India US Trade Deal: అమెరికాతో హిస్టారికల్ డీల్!  రొయ్య నుంచి రియాల్టీ దాకా.. ఆల్ ఈజ్ వెల్!
India Us Trade Deal
Ram Naramaneni
|

Updated on: Feb 03, 2026 | 9:48 PM

Share

’18 పర్సెంట్ టారిఫ్’ ఓ కనిపించని ఆయుధం. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చే ఓ బ్రహ్మస్త్రం. బంగ్లాదేశ్ సైతం బెంబేలెత్తిపోయింది ఈ ’18 పర్సెంట్’ వెపన్ చూసి. ‘కోటి ఉద్యోగాలు ఖతమ్’ అని పాకిస్తాన్ డైరెక్ట్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. తెగ మిడిసిపడిన బంగ్లాదేశ్‌కైతే.. దెబ్బ తగిలినట్టే లేదు గానీ బొబ్బలు మాత్రం తేలాయ్. పాక్-బంగ్లా అనే కాదు.. భారత్‌కు మేమే పోటీగా అని చెప్పుకుంటున్న కొన్ని దేశాలు ’18 పర్సెంట్’ బుల్డోజర్ కింద పడి నలిగిపోయాయి. అసలు.. యూరోపియన్ యూనియన్‌తో చేసుకున్న ఒప్పందమే అత్యంత భారీది. పవర్ షిఫ్ట్ అంటారే.. అలాంటి డీల్ అది. భారత్‌ను ఎకనమిక్ పవర్ హౌస్‌గా చేసే డీల్ యూరప్‌తో కుదిరింది. ఇప్పుడు అమెరికాతోనూ డీల్ కుదరడంతో.. ఇక భారత్‌కు తిరుగులేదని నిరూపించుకుంది. ఇంతకీ.. ఏంటి దీనివల్ల లాభం మనకి. నేరుగా గోదావరి జిల్లాల్లో ల్యాండ్ అవుదాం. అక్కడి రొయ్యని వెళ్లి అడగండిప్పుడు.. ‘ఆర్ యూ హ్యాపీ’ అని. ఎగిరి గంతేసి ఇదేనా సమాధానం అని చెబుతుంది. అమెరికా వెళ్లబోతున్నానోచ్ అని బ్యాగ్ సర్దేసుకుంటుంది. ట్రంప్ విధించిన టారిఫ్‌తో బాగా నష్టపోయిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశే. భారత్‌కు డాలర్లను పట్టుకొచ్చే పంటను పండిస్తున్నారు ఏపీ రైతులు. అలాంటి రొయ్యల ఎగుమతులపై ట్రంప్ సుంకాల భారం పడింది. ఇప్పుడిక భయం లేదు. ఆక్వా రైతుకు మళ్లీ మంచి రోజులొచ్చాయ్. ఇక హైదరాబాద్‌కొద్దాం. ఇక్కడి రియల్ ఎస్టేట్‌కి మరిన్ని శుభాలు జరగబోతున్నాయి....

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి