ఆస్ట్రేలియా – ఫేస్‌బుక్ మధ్య కుదిరిన డీల్.. న్యూస్ కంటెంట్ పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడి

Facebook To Restore Australia: ఆస్ట్రేలియా ప్రభుత్వం, ఫేస్ బుక్ మధ్య డీల్ కుదిరింది. గత కొన్నిరోజులుగా ఆస్ట్రేలియాకు సంబంధించిన వార్తల ప్రచురణ,..

ఆస్ట్రేలియా - ఫేస్‌బుక్ మధ్య కుదిరిన డీల్.. న్యూస్ కంటెంట్ పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడి
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 24, 2021 | 7:22 AM

Facebook To Restore Australia: ఆస్ట్రేలియా ప్రభుత్వం, ఫేస్ బుక్ మధ్య డీల్ కుదిరింది. గత కొన్నిరోజులుగా ఆస్ట్రేలియాకు సంబంధించిన వార్తల ప్రచురణ, పంచుకోవటంపై ఫేస్‌బుక్‌ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇరువర్గాల ఒప్పందంతో.. ఆస్ట్రేలియా న్యూస్ ఏజెన్సీలకు చెందిన వార్తలపై నిషేదాన్ని ఎత్తివేస్తున్నట్లు మంగళవారం ఫేస్‌బుక్ వెల్లడించింది. గూగుల్, ఫేస్‌బుక్‌ తదితర సోషల్ మీడియా సైట్లల్లో వార్తలు షేర్ చేస్తున్నందుకు వార్తాసంస్థలకు ఆ సంస్థలు డబ్బులు చెల్లించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఫేస్‌బుక్ ఆస్ట్రేలియాలోని‌ వినియోగదారులకు వార్తలను అందించడాన్ని, వారు తమ ప్లాట్‌ఫామ్‌పై కంటెంట్‌ను షేర్‌ చేయడాన్ని బ్లాక్‌ చేసింది.

ఫేస్‌బుక్‌లో వార్తలు అందుబాటులో లేకపోవటంతో ఆస్ట్రేలియా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో ఆస్ట్రేలియా, ఫేస్ బుక్ మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. తప్పని ప‌రిస్థితుల్లో ప్రభుత్వం, ఫేస్‌బుక్‌ను చర్చలకు ఆహ్వానించింది. ఈ క్రమంలో మీడియా చ‌ట్టాన్ని సవరించేందుకు ప్రభుత్వం అంగీక‌రించడంతో.. న్యూస్ పేజీల‌పై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఫేస్‌బుక్ వెల్లడించింది. ఈ మేరకు ఇరుపక్షాలు ఓ ఒప్పందానికి వచ్చినట్టు ఆస్ట్రేలియా ప్రభుత్వం, ఫేస్‌బుక్ వెల్లడించాయి.

Also Read:

ఆస్ట్రేలియాలో మళ్ళీ ఫేస్ బుక్ హవా, న్యూస్ కంటెంట్ పునరుధ్దరణపై జోరుగా యత్నాలు, త్వరలో రాజీ

అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి.. 5లక్షలు దాటిన మృతుల సంఖ్య.. క్యాండిల్ లైట్ చేపట్టిన బైడెన్

ఖేలో ఇండియాలో 323 కొత్త స్పోర్ట్స్ ప్రాజెక్ట్‌లు: క్రీడా మంత్రి
ఖేలో ఇండియాలో 323 కొత్త స్పోర్ట్స్ ప్రాజెక్ట్‌లు: క్రీడా మంత్రి
ఇందిరా దేవిపై సీరియస్ అయిన అపర్ణ.. కావ్యకు డబ్బులు ఇచ్చిన రాజ్..
ఇందిరా దేవిపై సీరియస్ అయిన అపర్ణ.. కావ్యకు డబ్బులు ఇచ్చిన రాజ్..
అప్పుడే పుట్టిన శిశువును ఆసుపత్రి టాయిలెట్‌లో పడేసి ఫ్లష్‌!
అప్పుడే పుట్టిన శిశువును ఆసుపత్రి టాయిలెట్‌లో పడేసి ఫ్లష్‌!
బాబోయ్ బీభత్సం..!! ఇది కదా అరాచకం అంటే..!
బాబోయ్ బీభత్సం..!! ఇది కదా అరాచకం అంటే..!
టాయిలెట్ కు వెళ్ళే సమయంలో ఈ తప్పులు చేస్తే.. వ్యాధులకు వెల్కమ్..
టాయిలెట్ కు వెళ్ళే సమయంలో ఈ తప్పులు చేస్తే.. వ్యాధులకు వెల్కమ్..
రూ.27 కోట్లలో అన్ని పోగా పంత్ చేతికి వచ్చేది అంతేనట..!
రూ.27 కోట్లలో అన్ని పోగా పంత్ చేతికి వచ్చేది అంతేనట..!
ఆ ఒక్కడి కోసం అన్ని జట్లు పోటీపడ్డాయి మరి చివరికి గెలిచింది ఎవరు?
ఆ ఒక్కడి కోసం అన్ని జట్లు పోటీపడ్డాయి మరి చివరికి గెలిచింది ఎవరు?
ట్రంప్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన పుతిన్..!
ట్రంప్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన పుతిన్..!
గూగుల్‌ మ్యాప్‌ మీరు ఎక్కడికెళ్లినా గమనిస్తుందా? ఈ సెట్టింగ్‌ ఆఫ
గూగుల్‌ మ్యాప్‌ మీరు ఎక్కడికెళ్లినా గమనిస్తుందా? ఈ సెట్టింగ్‌ ఆఫ
100 ఏళ్ల తర్వాత రిపీట్.. ఇంత తక్కువ స్కోర్‌కే ఆలౌటా?
100 ఏళ్ల తర్వాత రిపీట్.. ఇంత తక్కువ స్కోర్‌కే ఆలౌటా?