ఆస్ట్రేలియాలో మళ్ళీ ఫేస్ బుక్ హవా, న్యూస్ కంటెంట్ పునరుధ్దరణపై జోరుగా యత్నాలు, త్వరలో రాజీ
ఆస్ట్రేలియాలో ఫేస్ బుక్ సౌకర్యాన్ని పునరుధ్దరించే యత్నాలు ప్రారంభమయ్యాయి. రానున్న రోజుల్లో ఈ దేశ న్యూస్ పేజీలలో కంటెంట్ పై నిషేధాన్ని తాము ఎత్తివేస్తామని ఫేస్ బుక్ ప్రకటించింది.
ఆస్ట్రేలియాలో ఫేస్ బుక్ సౌకర్యాన్ని పునరుధ్దరించే యత్నాలు ప్రారంభమయ్యాయి. రానున్న రోజుల్లో ఈ దేశ న్యూస్ పేజీలలో కంటెంట్ పై నిషేధాన్ని తాము ఎత్తివేస్తామని ఫేస్ బుక్ ప్రకటించింది. ప్రభుత్వం కూడా ఫేస్ బుక్ కి సంబంధించిన చట్టాలలోని కొన్ని నిబంధనలను సవరించేందుకు అంగీకరించింది. వీటిలోని కీలకాంశాలపై తాము ఓ అంగీకారానికి వచ్చినట్టు ఆస్ట్రేలియా ట్రెజరర్ జోష్ ఫ్రైడెన్ బెర్గ్, ఫేస్ బుక్ ప్రతినిధులు సూత్రప్రాయంగా తెలిపారు. సవరించిన నిబంధనల కింద కంటెంట్ కి గాను డిజిటల్ సంస్థలు న్యూస్ కంపెనీలకు చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. ఈ మార్పుల నేపథ్యంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ జర్నలిజంలో మా సహకారాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తామని, మరి కొద్ధి రోజుల్లో ఆస్ట్రేలియన్లకు న్యూస్ కంటెంట్ ను పునరుధ్దరిస్తామని ఫేస్ బుక్ ఆస్ట్రేలియా ఎండీ విల్ ఈస్టన్ తెలిపారు.
ఈ దేశంలో కోడ్ విధింపునకు సంబంధించి ప్రభుత్వం విధించిన ఆంక్షలవంటివాటికి నిరసనగా గతవారం ఫేస్ బుక్ యూజర్లకు న్యూస్ లింకుల పోస్టింగులకు ఆస్కారం లేకుండా బ్యాన్ విధించింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రజలు న్యూస్ కంటెంట్ కి నోచుకోలేకపోయారు. ప్రధాని స్కాట్ మారిసన్ కూడా తన సొంత పేజ్ లో ఫేస్ బుక్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకరమైనదని వ్యాఖ్యానించారు. ఏమైతేనేం ? తాజా పరిణామాల పట్ల ఫేస్ బుక్ హర్షం వ్యక్తం చేసింది. ప్రభుత్వం కూడా ఇలాగే స్పందించింది.
మరిన్ని చదవండి ఇక్కడ :
లీకుల రాయుడులా తమన్… సర్కారీ పాటల డేట్ ఇదే అంటూ.. థమన్ లీకులు
మహబూబాబాద్ ను వణికిస్తున్న దెయ్యం భయం.. వైరల్‌గా మారిన దెయ్యం వీడియో..!: Devil Video
ఎన్టీఆర్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్..హాలీవుడ్ సినిమాలో ఎన్టీఆర్: NTR in Hollywood video