TikTok Ban: భారత్ బాటలో పాకిస్తాన్.. ఏడాదిలో రెండవసారి ఇలా చేయడం.. చైనాకు షాక్..!

TikTok Ban: పాకిస్తాన్ కూడా భారత్ బాటలో పయనిస్తుంది. భారత్ ఏం చేసిందో పాకిస్తాన్ కూడా ఇప్పుడు అదే పని చేసింది. ఇంతకీ ఏంటా పని..

TikTok Ban: భారత్ బాటలో పాకిస్తాన్.. ఏడాదిలో రెండవసారి ఇలా చేయడం.. చైనాకు షాక్..!
Tiktok
Follow us

|

Updated on: Jun 29, 2021 | 7:08 PM

TikTok Ban: పాకిస్తాన్ కూడా భారత్ బాటలో పయనిస్తుంది. భారత్ ఏం చేసిందో పాకిస్తాన్ కూడా ఇప్పుడు అదే పని చేసింది. ఇంతకీ ఏంటా పని అని ఆలోచిస్తున్నారా? వెయిట్.. అదే చెప్పబోతున్నాం. చైనాకు చెందిన వీడియో షేరింగ్ యాప్‌ను గతేడాది భారత్‌లో నిషేధించిన విషయం తెలిసిందే. భారతదేశంలో నిషేధించబడిన సరిగ్గా ఒక సంవత్సరం తరువాత, ఇప్పుడు టిక్ టోక్‌పై పాకిస్తాన్‌‌లో నూ బ్యాన్ వేటు పడింది. పాకిస్తాన్ హైకోర్టు టిక్‌టాక్‌ను తాత్కాలికంగా నిషేధించింది. చైనా వీడియో షేరింగ్ యాప్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను విచారించిన సింధ్ హైకోర్టు.. జూలై 8 న జరగనున్న తదుపరి విచారణ వరకు చైనా యాప్‌ను నిలిపివేయాలని పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్స్ అథారిటీ (పిటిఎ) ను ఆదేశించింది. ఈ యాప్‌ దేశంలో ‘అనైతికత, అశ్లీలతను వ్యాప్తి చేస్తోంది’ అనే కారణంతో తాత్కాలికంగా నిషేధం విధించారు.

కాగా, ఏడాది కాలంలో పాకిస్తాన్‌లో టిక్‌టాక్‌ని నిషేధించడం ఇది రెండోసారి. ఈ ఏడాది మార్చి నెలలో అనేక మంది పౌరులు టిక్‌టాక్‌కు వ్యతిరేకంగా పెషావర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాటిపై విచారించిన పెషావర్ హైకోర్టు.. టిక్‌టాక్‌పై కొన్ని వారాల పాటు నిషేధం విధించింది. ఆ తరువాత మళ్లీ ఆ నిషేధాన్ని ఎత్తివేశారు. అయితే, అనైతికత, అశ్లీలతను ప్రోత్సహించే కంటెంట్‌ను ప్రచారం చేయకుండా చర్యలు తీసుకోవాలని ప మార్చిలో, అనేక మంది పౌరులు దాఖలు చేసిన పిటిషన్‌పై పెషావర్ హైకోర్టు (పిహెచ్‌సి) ఇలాంటి చర్య తీసుకుంది. ఏదేమైనా, కొన్ని వారాల తరువాత పిహెచ్‌సి నిషేధాన్ని ఎత్తివేసింది, “అనైతిక కంటెంట్” అప్‌లోడ్ చేయబడకుండా చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్స్ అథారిటీ(పిటిఎ)ని ఆదేశించింది.

నిషేధంపై కోర్టు ఏం చెప్పిందంటే.. టిక్‌టాక్ యాజమాన్యం.. పాకిస్తాన్ నియమ నిబంధనలను గౌరవించడం, పాటించడం లేదని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇస్లాం, పాకిస్తాన్ సంస్కృతిని అర్థం చేసుకోవడంలో యాప్ యాజమాన్యం పూర్తిగా విఫలమైందన్నారు. ఆ కారణంగా యాప్‌ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని, తదుపరి నిర్ణయం జులై 8న ప్రకటిస్తామని సింధ్ కోర్టు తెలిపింది. కాగా, పాకిస్తాన్‌లో 30 మిలియన్ల మంది టిక్‌టాక్‌ యూజర్లు ఉన్నారు.

Also read:

RRR Movie: ‘ఆర్ఆర్ఆర్‌’నూ వదలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. ఇప్పుడు ఫర్‌ఫెక్ట్ అంటూ తెగ ట్రోల్ చేసేస్తున్నారు..!

Uber CEO : డెలివరీ బాయ్‌గా పనిచేసిన ఊబర్ సీఈవో..! ఇలా ఎందుకు చేశాడో తెలుసా..?

Hyderabad Skin Bank: తెలుగు రాష్ట్రాల్లో తొలి చర్మ బ్యాంకుకు శ్రీకారం.. ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో అత్యాధునిక చికిత్స