RRR Movie: ‘ఆర్ఆర్ఆర్‌’నూ వదలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. ఇప్పుడు ఫర్‌ఫెక్ట్ అంటూ తెగ ట్రోల్ చేసేస్తున్నారు..!

RRR Movie: సోషల్ మీడియాను వాడుకోవడంలో హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల తరువాతే మరెవరైనా అని చెప్పాలి. ట్రాఫిక్ రూల్స్‌పై ప్రజల్లో...

RRR Movie: ‘ఆర్ఆర్ఆర్‌’నూ వదలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. ఇప్పుడు ఫర్‌ఫెక్ట్ అంటూ తెగ ట్రోల్ చేసేస్తున్నారు..!
Rrr Movie
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 29, 2021 | 7:11 PM

RRR Movie: సోషల్ మీడియాను వాడుకోవడంలో హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల తరువాతే మరెవరైనా అని చెప్పాలి. ట్రాఫిక్ రూల్స్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తమదైన స్టైల్లో సోషల్ మీడియాను ఓ రేంజ్‌లో వినియోగించుకుంటున్నారు. ఛాన్స్ దొరికితే చాలు.. దబిడి దిబిడే అంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఓవైపు.. ట్రాఫిక్ ఉల్లంఘనులకు స్ట్రాంగ్‌గా చురకలంటిస్తూనే.. మరోవైపు ఇతర వాహనదారులకు అవగాహనతో పాటు.. ట్రాపిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిగే పరిణామాల పట్ల భయాన్ని కల్పిస్తున్నారు. మొత్తంగా వాహనదారుల శ్రేయస్సు కోరుతూ హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. దొరికి ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు.

దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి డైరెక్షన్‌లో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ల భారీ మల్టీస్టారర్‌ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు నేషనల్ వైడ్‌గా విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ సినిమా ఎప్పుడు రీలీజ్ అవుతుందా? అని అటు నందమూరి ఫ్యాన్స్, ఇటు మెగా ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి ఒక పోస్టర్‌ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఎన్టీఆర్, తారక్ ఇద్దరూ బైక్‌పై దూసుకెళ్తూ ఉంటారు ఈ పోస్టర్‌లో.

అయితే, ఆర్ఆర్ఆర్ మూవీ పోస్టర్ విడుదల అవడమే ఆలస్యం.. ఆ క్రేజ్‌ను కూడా వాడేసుకున్నారు మన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. పోస్టర్‌ను ఎడిట్ చేసిన ట్రాఫిక్ పోలీసులు.. బైక్ డ్రైవ్ చేసే తారక్‌కి, వెనుక కూర్చున్న రామ్‌ చరణ్‌కి హెల్మెట్ సెట్ చేసి.. ఇప్పుడు ఫర్‌ఫెక్ట్ అంటూ క్యాప్షన్ పెట్టి ట్రోల్ చేశారు. ‘హెల్మెట్ ధరించండి.. సురక్షితంగా ఉండండి’ అంటూ క్యాప్షన్ పెట్టి.. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తున్నారు.

RRR Movie Tweet: