AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Freida Pinto: పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయినా హీరోయిన్.. ప్రియుడి ఫోటోలను నెట్టింట్లో షేర్ చేసిన ఫ్రిదా..

ఆస్కార్ అవార్డ్ అందుకున్న బ్రిటిష్ డ్రామా సినిమా స్లమ్ డాగ్ మిలియనీర్ తో క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ ఫ్రిదా పింటో త్వరలో తల్లి కాబోతుంది.

Freida Pinto: పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయినా హీరోయిన్.. ప్రియుడి ఫోటోలను నెట్టింట్లో షేర్ చేసిన ఫ్రిదా..
Freisda Pinto
Rajitha Chanti
|

Updated on: Jun 29, 2021 | 6:35 PM

Share

ఆస్కార్ అవార్డ్ అందుకున్న బ్రిటిష్ డ్రామా సినిమా స్లమ్ డాగ్ మిలియనీర్ తో క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ ఫ్రిదా పింటో త్వరలో తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. తన ప్రియుడితోలి కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ.. త్వరలోనే బుల్లి ట్రాన్ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నాడంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. కాగా కోరీ ట్రాన్, ఫ్రిదా పింటో 2017 నుంచి రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఈ జంట 2019లో వివాహ జీవితంలోకి అడుగు పెట్టెందుకు నిశ్చితార్థం కూడా చేసుకున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పటివరకు వీరి పెళ్లి మాత్రం జరగలేదు.

తాజాగా ఫ్రిదా ఆమె ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని తన ప్రియుడిత కలిసి సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో.. సెలబ్రెటీలు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఫ్రిదా కెరీర్ విషయానికి వస్తే.. 2008లో విడుదలైన స్లమ్ డాగ్ మిలయనీర్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. డానీ బాయిల్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఫ్రిదా లతికా అనే పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఆమె రైజ్‌ ఆఫ్‌ ద ప్లానెట్‌ ఆఫ్‌ ద ఏప్స్‌, ఇమ్మోర్టల్స్‌ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఫ్రిదా ‘బ్రిటన్స్‌ వరల్డ్‌ వార్‌ 2’ తోపాటు ‘స్పై ప్రిన్సెస్‌: ద లైఫ్‌ ఆఫ్‌ నూర్‌ ఇనాయత్‌ ఖాన్‌’ చిత్రాల్లో ​కీలక పాత్రలు పోషిస్తోంది.

ట్వీట్..

View this post on Instagram

A post shared by Freida Pinto (@freidapinto)

Also Read: Jabardasth Avinash: పెళ్లికొడుకుగా మారిన జబర్ధస్థ్ అవినాష్… అమ్మాయి ఎవరో ? సోషల్ మీడియాలో నయా లుక్ వైరల్..

Bellamkonda Srinivas: బెల్లంకొండ కష్టాలు మాములుగా లేవుగా.. ‘చత్రపతి’ కోసం హిందీ క్లాసులు తీసుకుంటున్న యంగ్ హీరో…

Narappa Movie: ఓటీటీలోకి వెంకటేష్ “నారప్ప”.. చిత్రయూనిట్‏తో ప్రైమ్ చర్చలు ?… రిలీజ్ ఎప్పుడంటే…