AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Avinash: పెళ్లికొడుకుగా మారిన జబర్ధస్థ్ అవినాష్… అమ్మాయి ఎవరో ? సోషల్ మీడియాలో నయా లుక్ వైరల్..

కరోనా రెండో దశ మన దేశంలో తీవ్ర ప్రభావం చూపింది. రోజుకు వేలల్లో కేసులు నమోదు కాగా.. మరోవైపు ఆయా రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి.

Jabardasth Avinash: పెళ్లికొడుకుగా మారిన జబర్ధస్థ్ అవినాష్... అమ్మాయి ఎవరో ? సోషల్ మీడియాలో నయా లుక్ వైరల్..
Avinash
Rajitha Chanti
|

Updated on: Jun 29, 2021 | 4:54 PM

Share

కరోనా రెండో దశ మన దేశంలో తీవ్ర ప్రభావం చూపింది. రోజుకు వేలల్లో కేసులు నమోదు కాగా.. మరోవైపు ఆయా రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. దీంతో శుభకార్యాలు.. అశుభ కార్యాలకు అతి తక్కువ మంది హాజరుకావాలని అధికారులు సూచించిన సంగతి తెలిసిందే. ఇక ఈ కరోనా సమయంలో ఎంతో మంది స్టార్స్ వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు. తమ కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకొని.. ఆ ఫోటోలను షేర్ చేశారు.

తాజాగా జబర్ధస్థ్ కమెడియన్ ముక్కు అవినాష్ కూడా పెళ్లి చేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా అవినాష్ తన ఇన్‏స్టాగ్రామ్‏లో పోస్ట్ చేసిన ఫోటోతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. పూర్తిగా పెళ్లి కొడుకుగా ముస్తాబై తన ఇన్‏స్టాగ్రామ్‏లో షేర్ చేశాడు అవినాష్. ఇంకేముంది.. అవినాష్ కు శుభాకాంక్షలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. అవినాష్ నిజంగానే పెళ్లిచేసుకోబోతున్నాడా ? లేదా.. ఏదైనా షో కోసం ఇలా రెడీ అయ్యాడా ? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. జబర్దస్థ్ కామెడీ షో ద్వారా గుర్తింపు పొందిన అవినాష్.. ఆ తర్వాత ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ లోకి వెళ్లి దాదాపు 90 రోజులు ఉన్నాడు. ఇక ఆ ఇంట్లో ఉన్నన్ని రోజులు అవినాష్ పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అంటూ ఎన్నో సార్లు చెప్పిన సంగతి తెలిసిందే. మరి నిజంగానే అవినాష్ పెళ్లి చేసుకోబోతున్నాడా ? లేకా.. ఏదైనా షో కోసం ఇలా రెడీ అయ్యాడో చూడాలి మరి..

ట్వీట్..

Also Read: Asaduddin Owaisi: బక్రీద్ పండుగకు వ్యాపారులను ఇబ్బంది పెట్టొద్దు.. రాష్ట్ర డీజీపీకి లేఖ రాసిన మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ

Bellamkonda Srinivas: బెల్లంకొండ కష్టాలు మాములుగా లేవుగా.. ‘చత్రపతి’ కోసం హిందీ క్లాసులు తీసుకుంటున్న యంగ్ హీరో…

Medak Farmer: మెదక్‌ జిల్లాలో రైతు ఆగ్రహం.. తనతో పాటు తహశీల్దార్‌పై డీజిల్‌ పోసి నిరసన.. సిబ్బంది అప్రమత్తంతో తప్పిన ముప్పు