Narappa Movie: ఓటీటీలోకి వెంకటేష్ “నారప్ప”.. చిత్రయూనిట్‏తో ప్రైమ్ చర్చలు ?… రిలీజ్ ఎప్పుడంటే…

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Jun 29, 2021 | 7:16 PM

విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా నారప్ప. తమిళ స్టార్ ధనుష్ నటించిన సూపర్ హిట్ మూవీ అసురన్ కు రీమేక్ గా ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు.

Narappa Movie: ఓటీటీలోకి వెంకటేష్ నారప్ప.. చిత్రయూనిట్‏తో ప్రైమ్ చర్చలు ?... రిలీజ్ ఎప్పుడంటే...
Narappa Movie

విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా నారప్ప. తమిళ స్టార్ ధనుష్ నటించిన సూపర్ హిట్ మూవీ అసురన్ కు రీమేక్ గా ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వెంకటేష్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇందులో వెంకటేష్ సరసన ప్రియమణి నటిస్తున్నారు. కుల వ్యవస్థ, భూ వివాదం.. వంటి సామాజిక అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తైంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లు, టీజర్ ఆకట్టుకున్నాయి. సురేశ్ ప్రొడక్షన్స్ .. కలైపులి థాను కలిసి  నారప్పను నిర్మిస్తున్నారు. మణిశర్మ అందిస్తున్న సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. అయితే ఈ మూవీని ముందుగా మే 14న థియేటర్లలో విడుదల చేయాలని భావించింది చిత్రయూనిట్.

కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది. లాక్ డౌన్ అనంతరం పూర్తి స్థాయిలో థియేటర్లు ఎప్పుడు తెరుచుకున్నాయనే విషయంలో ఇప్పటికీ స్పష్టత రావడం లేదు. దీంతో చిత్రయూనిట్ ఈ మూవీని ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ నారప్ప చిత్రయూనిట్ తో చర్చలు జరిపిందని… అందుకు నారప్ప టీం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఈ మూవీని జూలై 24న అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయనున్నట్లుగా సమాచారం. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే.. నారప్ప మూవీ సెన్సార్ ప్రక్రియ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ కమిటీ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇక థియేటర్ రిలీజ్ లేక ఓటిటి రిలీజ్ అనే విషయంపై  రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు నారప్ప టీం.

Also Read: Alternate Fuel Engine: ఇథనాల్ ఆధారిత ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్ లకు భారత్ లో అనుమతి.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

Chandrababu: రాష్ట్రంలో హోల్ సేల్ అవినీతి.. ఇచ్చేది గోరంత.. దోచుకునేది కొండంత.. సాధన దీక్షలో సీఎం జగన్‌పై చంద్రబాబు ఫైర్

MLA Seethakka: రేవంత్ రెడ్డి కోసం సీతక్క మొక్కులు.. మేడారంలో సమ్మక్క సారలమ్మకు ప్రత్యేక పూజలు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu