Aha: ‘ఆహా’ వేదికగా మరోసారి వినోదాల సందడి.. రెండు సూపర్ హిట్ చిత్రాలు స్ట్రీమింగ్..
తెలుగులో మొట్ట మొదటి ఓటీటీ సంస్థ... 'ఆహా ' మరోసారి సినీ ప్రేమికులకు సర్ప్రైజ్ ఇచ్చేసింది. ప్రతి వారం కొత్త కంటెంట్ సినిమాలతోపాటు..బ్లాక్ బస్టర్ హిట్స్, వెబ్ సిరీస్ తో

తెలుగులో మొట్ట మొదటి ఓటీటీ సంస్థ… ‘ఆహా ‘ మరోసారి సినీ ప్రేమికులకు సర్ప్రైజ్ ఇచ్చేసింది. ప్రతి వారం కొత్త కంటెంట్ సినిమాలతోపాటు..బ్లాక్ బస్టర్ హిట్స్, వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కొత్త నెల ఆరంభంలోనే… మూవీ లవర్స్ కోసం రెండు సూపర్ హిట్ చిత్రాలను స్ట్రీమింగ్ చేయనుంది. అయితే ఈసారి ‘ఆహా’ తెలుగు సినిమాతోపాటు.. మరో తమిళ్ డబ్బింగ్ సినిమా కావడం విశేషం. ఈ వీకెండ్లో స్ట్రీమింగ్ అయ్యే రెండు సినిమాలెంటో తెలుసుకుందాం.
బుల్లితెర పై తన వాక్చాతుర్యంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ ప్రదీప్ వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రదీప్ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ మూవీ ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ జూలై 2 నుంచి ‘ఆహా’ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మున్నా తెరకెక్కించగా.. అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. పునర్జన్మల లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఇదే కాకుండా.. ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానున్న మరో సినిమా ‘పొగరు’. తమిళ స్టార్ హీరో ద్రువ్ సర్జా, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటించిన ఈమూవీ తెలుగులో డబ్ అయి మంచి విజయం అందుకుంది. ధనుంజయ రవిశంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా జూలై 2 నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. వీటితో పాటు.. ‘ఆహా’ ప్రేక్షకుల కోసం ఎన్నో వైవిధ్యభరితమైన సినిమాలను అందిస్తుంది. తెలుగులో సూపర్ హిట్ అయిన క్రాక్, నాంది, జాంబీరెడ్డి, 11th అవర్, ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్, చావు కబురు చల్లగా.. జీవీ, ఎల్కేజీ వంటి సూపర్ హిట్ చిత్రాలను ఆహా అందిస్తుంది. సినీ ప్రేమికులకు వారాంతరాలను ఎంతో వినోదభరితంగా మార్చేందుకు ‘ఆహా’ తిరుగులేని ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది.
Also Read: Viral Video: అర్ధరాత్రి ఎద్దు బీభత్సం.. ముసలావిడపై మెరుపు దాడి.. షాకింగ్ దృశ్యాలు వైరల్!





