Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss: సోషల్‌ మీడియా ఖాతాలను తొలగించింది.. 32 కిలోలు తగ్గింది.. ఎలాగంటే..

సాధారణంగా అధిక బరువును తగ్గించుకునేందుకు చాలామంది ఆరోగ్యకరమైన జీవనశైలిని...

Weight Loss: సోషల్‌ మీడియా ఖాతాలను తొలగించింది.. 32 కిలోలు తగ్గింది.. ఎలాగంటే..
Follow us
Basha Shek

|

Updated on: Oct 29, 2021 | 9:21 AM

సాధారణంగా అధిక బరువును తగ్గించుకునేందుకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుంటారు. ఇందులో భాగంగా ఆహారపు అలవాట్లను మార్చుకుంటారు. జిమ్‌కు వెళ్లి వ్యాయామాలు, వర్కవుట్లు చేస్తారు. అయితే ఒక మహిళ మాత్రం అధిక బరువును తగ్గించుకునేందుకు తన ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్‌, ట్విట్టర్‌ తదితర సోషల్‌ మీడియా ఖాతాలను తొలగించింది. తన ప్రయత్నంతో లాక్‌డౌన్‌లో పెరిగిన 2 కిలోల బరువును కరిగించుకుంది. అదేంటి.. సామాజిక మాధ్యమాల అకౌంట్లను డిలీట్‌ చేస్తే ఎలా బరువు తగ్గుతారని ఆశ్చర్యపోతున్నారా? అయితే పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి.

అదే నా వెయిట్‌ లాస్‌ సీక్రెట్‌.. 33 ఏళ్ల బ్రెండా ఫిన్‌ లాక్‌డౌన్‌ కాలంలో భారీగా బరువు పెరిగింది. లాక్‌డౌన్‌కు ముందు 58 కిలోల బరువున్న ఆమె ఏకంగా 90 కిలోలకు పైగా చేరుకుంది. ఇది గ్రహించిన బ్రెండా బరువును తగ్గించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. ఫలితం మాత్రం కనిపించలేదు. తన అధిక బరువుకు కారణాలేంటో అన్వేషించగా అసలు విషయం తెలిసింది. ‘కరోనా కాలంలో ఇంటి దగ్గర ఉండడంతో సోషల్‌ మీడియాను ఎక్కువగా వినియోగించేదాన్ని. ముఖ్యంగా ఫేస్‌బుక్‌లో ఫుడ్‌కు సంబంధించి వచ్చే ప్రకటనలు నా నోటికి అడ్డు, అదుపు లేకుండా చేశాయి. ప్రాసెస్డ్‌, ప్యాకెజ్డ్‌ ఫుడ్స్‌ను ఎక్కువగా తినేదాన్ని. దీంతో చూస్తుండగానే భారీగా బరువు పెరిగిపోయాను. ఆతర్వాత కూడా కొవ్వు ఆహార పదార్థాలను తీసుకోవడం మానలేదు. నన్ను నేను నియంత్రించుకోలేకపోయాను. చివరకు నా నోటికి కళ్లెం వేసుకునేందుకు ఫేస్‌బుక్‌, వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌ అకౌంట్లను పూర్తిగా తొలగించాను. కచ్చితమైన డైట్‌ నియమాలు పాటించాను. మరింత ఫోకస్‌గా పనిచేయడం ప్రారంభించాను. నా ప్రయత్నం విజయవంతమైంది. ప్రస్తుతం నా బరువు 58 కిలోలు. ఇప్పుడు నాకు నేను బాగా నచ్చుతున్నాను’ అని తన వెయిట్‌లాస్‌ సీక్రెట్స్‌ గురించి చెప్పుకొచ్చింది బ్రెండా.

Also Read:

Food Adulteration: మీరు వాడుతున్న టీ పొడి స్వచ్ఛమైనదేనా?..ఇలా గుర్తించండి..

Aloe Vera: వీళ్లు కలబందను తీసుకోవడం చాలా ప్రమాదం.. ఎందుకో తెలుసుకోండి..

Tirumala: శ్రీవారి భక్తులకు గమనిక.. నవంబర్ 4 న స్వామివారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..