Tirumala: శ్రీవారి భక్తులకు గమనిక.. నవంబర్ 4 న స్వామివారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
Tirumala Tirupati : కలియుగ దైవంగా భక్తులతో పూజలందుకుంటున్న శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి ఆలయంలో నవంబరు 3న వీఐపీ..
Tirumala Tirupati : కలియుగ దైవంగా భక్తులతో పూజలందుకుంటున్న శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి ఆలయంలో నవంబరు 3న వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీడీపీ తెలిపింది. దీపావళి పండగని పురష్కరించుకుని నవంబర్ 4 నశ్రీవారి ఆలయంలో ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పూజలకు ఇబ్బంది తలెత్తకుండా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీడీపీ రద్దు చేసింది. ఇందులో భాగంగా బ్రేక్ దర్శనానికి సంబంధించిన సిఫార్స్ లెటర్స్ ను ముందురోజునుంచి స్వీకరించబడవని టీడీపీ అధికారులు స్పష్టం చేశారు. ఈ విషయం భక్తులు గమనించి సహకరించవల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
Also Read: కర్నూలు జిల్లాలో స్థల విషయంలో వైసీపీ టీడీపీ నేతల మధ్య ఘర్షణ… ఇరువురు నేతలు అరెస్ట్..