Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Narendra Modi: రోమ్‌కు చేరుకున్న ప్రధాని మోదీ.. నేడు క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్‌తో భేటీ

PM Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోమ్‌కు చేరుకున్నారు. ఇటలీలో జరిగే 16 జీ-20 సమావేశంలో భాగంగా మోదీ మూడు రోజుల పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా

PM Narendra Modi: రోమ్‌కు చేరుకున్న ప్రధాని మోదీ.. నేడు క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్‌తో భేటీ
Pm Modi
Follow us
Shaik Madar Saheb

| Edited By: Phani CH

Updated on: Oct 29, 2021 | 7:01 AM

PM Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోమ్‌కు చేరుకున్నారు. ఇటలీలో జరిగే 16 జీ-20 సమావేశంలో భాగంగా మోదీ మూడు రోజుల పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ముందు క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్‌తో ప్రధానమంత్రి నరేంద్రమోదీ భేటీకానున్నారు. ఇటలీ రాజధాని రోమ్‌లో అక్టోబర్ శుక్రవారం నుంచి ఆదివారం వరకు జీ-20 సమావేశం జరగనుంది. ఈ మేరకు ప్రధాని మోదీ ట్విట్ చేశారు. ఈ జీ20 సమావేశంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, కరోనా మహమ్మారి విసిరిన సవాళ్లపై, యూకేలోని గ్లాస్గోలో వాతావరణ మార్పులపై ప్రపంచ దేశాల అధినేతలతో చర్చించబోతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. ఇటలీ, యూకే పర్యటనకు వెళ్లే ముందు ఆయన గురువారం ఒక ప్రకటన సైతం విడుదల చేశారు. ఈ మేరకు గురువారం రాత్రి ఢిల్లీ నుంచి రోమ్‌కు బయలుదేరి వెళ్లారు. మోదీ నేటినుంచి 31 దాకా రోమ్‌లో, నవంబర్‌ 1 నుంచి 2 వరకూ యూకే గ్లాస్గోలో పర్యటించనున్నట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష్ వర్ధన్ శ్రింగ్లా తెలిపారు.

కాగా.. రోమ్‌లో జి–20 శిఖరాగ్ర సదస్సులో 26 దేశాల అధినేతలు పాల్గొననున్నారు. ఇటలీ ప్రధానమంత్రి మారియో డ్రాఘీ ఆహ్వానం మేరకు రోమ్‌తోపాటు వాటికన్‌ సిటీతో పోప్‌ ఫ్రాన్సిస్‌తో సమావేశమవుతానని మోదీ వెల్లడించారు. భాగస్వామ్య దేశాల అధినేతలతో సమావేశమై.. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నట్లు వెల్లడించారు. గ్లాస్గోలో రెండు రోజులపాటు జరిగే కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీ (కాప్‌) సదస్సుకు 120 దేశాలకు చెందిన అధ్యక్షులు, ప్రతినిధులు హాజరవుతారు.

Also Read:

Anita Anand: కెనడా రక్షణ మంత్రిగా భారత సంతతి మహిళ.. అనితా ఆనంద్‌‌కు కీలక బాధ్యతలు..

Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకున్న భారతీయులను తిరిగి తీసుకురండి.. ప్రధానికి లేఖ రాసిన ఇండియన్ వరల్డ్ ఫోరం!