Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకున్న భారతీయులను తిరిగి తీసుకురండి.. ప్రధానికి లేఖ రాసిన ఇండియన్ వరల్డ్ ఫోరం!

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు అధికారంలోకి వచ్చి చాలారోజులు అయింది. అక్కడ తలెత్తిన సంక్షోభంలో చాలా దేశాల ప్రజలు చిక్కుబడిపోయారు. వివిధ కారణాలతో.. ఆఫ్ఘనిస్తాన్ లో ఉండిపోయిన వారిని ఆయా దేశాలు తమ దేశాలకు తీసుకువెళ్ళే ఏర్పాట్లు చేశాయి.

Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకున్న భారతీయులను తిరిగి తీసుకురండి.. ప్రధానికి లేఖ రాసిన ఇండియన్ వరల్డ్ ఫోరం!
Pm Modi Live
Follow us
KVD Varma

|

Updated on: Oct 27, 2021 | 9:19 AM

Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు అధికారంలోకి వచ్చి చాలారోజులు అయింది. అక్కడ తలెత్తిన సంక్షోభంలో చాలా దేశాల ప్రజలు చిక్కుబడిపోయారు. వివిధ కారణాలతో.. ఆఫ్ఘనిస్తాన్ లో ఉండిపోయిన వారిని ఆయా దేశాలు తమ దేశాలకు తీసుకువెళ్ళే ఏర్పాట్లు చేశాయి. భారత్ కూడా అందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసి అక్కడ ఉన్న భారత పౌరులను తిరిగి తీసుకువచ్చింది. అయితే, ఇప్పటికీ ఇంకా అక్కడ కొందరు భారతీయులు చిక్కుబడిపోయినట్టు తెలుస్తోంది. భారతీయులను తరలించే సమయంలో ఆ అవకాశాన్ని వినియోగించుకోవడంలో ఇబ్బందులు పడ్డవారు ఇంకా అక్కడే ఇబ్బందులు పడుతూ జీవిస్తున్నారు. ఈ విషయాన్ని ఇండియన్ వరల్డ్ ఫోరం, ఇతర ఎన్‌జీఓలు వెలుగులోకి తీసుకువచ్చాయి. సుమారు 100 మంది భారత పౌరులు ఇంకా ఆఫ్ఘనిస్తాన్ లో చిక్కుకుపోయారని ఆ సంస్థలు చెబుతున్నాయి. ఈ మేరకు అవి ప్రధాని నరేంద్ర మోడీకి, విదేశాంగ శాఖకు లేఖ రాశాయి. వారిని సురక్షితంగా మన దేశానికి తీసుకురావడానికి చర్యలు చేపట్టాలని ఆ సంస్థలు ఆ లేఖలో కోరాయి.

ఇంకా ఆఫ్ఘనిస్తాన్ లో ఉండిపోయిన వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారని ఇండియా వరల్డ్ ఫోరం వెల్లడిస్తోంది. వారి పరిస్థితిపై ఫోరం ఆందోళన వ్యక్తం చేసింది. వీరే కాకుండా అక్కడ నుంచి 200 మంది అఫ్ఘనిస్తానీలు కూడా భారత్ రావాలని కోరుకుంటున్నారని ఈ సంస్థలు ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నాయి. వీరంతా భారత వీసాల కోసం ఎదురుచూపులు చూస్తున్నారని ఈ సంస్థలు చెబుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి తమను విముక్తులను చేయాలని ఎన్జీవో సంస్థలకు వీరంతా ఫోన్లు చేస్తున్నారని చెబుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల పాలనలోకి వెళ్ళిన వెంటనే భారతదేశం అక్కడి వారికి జారీచేసిన వీసాలను క్యాన్సిల్ చేసింది. ఈ-వీసాలు ఉన్నవారినే దేశంలోకి అనుమతిస్తామని భారత ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఇప్పటివరకూ అక్కడ చిక్కుబడిన భారతీయులకు ఈ వీసాలు మంజూరు కాలేదు. దీంతో వారంతా ఎన్జీవోలను తమను ఆడుకోమంటూ వేడుకుంటున్నారు. ఈ మేరకు ఇండియన్ వరల్డ్ ఫోరం, ఇతర ఎన్‌జీఓలు ప్రధానికి, విదేశాంగ శాఖకు లేఖను రాశాయి.

ఇవి కూడా చదవండి: Fact Check: రైల్వేలో ఉద్యోగం వచ్చిందంటూ మెయిల్ వచ్చిందా? జాగ్రత్త.. ఇది మీ సమాచారం దోచేస్తుంది..ఎలా అంటే..

Pension: మీరు పెన్షన్ తీసుకుంటున్నారా? లేదా మీ ఇంట్లో పెన్షనర్స్ ఉన్నారా? వెంటనే ఇలా చేయకపోతే పెన్షన్ ఆగిపోవచ్చు!

Weather: నైరుతి ఉపసంహరణ.. ఈశాన్య రుతుపవనాల ఎంట్రీ.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం!