Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: సముద్ర తాబేలుకు పునర్జన్మ ప్రసాదించిన యూట్యూబర్లు.. హృదయాన్ని కరిగించే వైరల్ వీడియో

ఈ మధ్య కాలంలో జంతువులు, పక్షులు, జలచరాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాబేలుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Viral Video: సముద్ర తాబేలుకు పునర్జన్మ ప్రసాదించిన యూట్యూబర్లు.. హృదయాన్ని కరిగించే వైరల్ వీడియో
Sea Turtle Viral Video
Follow us
Janardhan Veluru

|

Updated on: Oct 28, 2021 | 3:46 PM

ఈ మధ్య కాలంలో జంతువులు, పక్షులు, జలచరాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సముద్ర తాబేలుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సముద్ర తీరంలో చిక్కుకుపోయిన భారీ తాబేలుకు ఇద్దరు వ్యక్తులు ప్రాణం పోసిన వీడియో ఇది. ఆస్ట్రేలియాలో సముద్రపు అలల తాకిడికి భారీ తాబేలు సముద్రతీరానికి కొట్టుకువచ్చింది. ఆ తాబేలు వెల్లకిలా పడి ఇసుకులో కూరుకుపోయింది. సముద్రంలోకి వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. సముద్ర తీరంలో భారీ తాబేలు చిక్కుకపోవడాన్ని బోటులో సముద్రంలో ప్రయాణిస్తున్న ఆస్ట్రేలియా యూట్యూబర్లు గుర్తించారు. 100 కేజీలకు పైగా బరువున్న తాబేలను కాపాడి సముద్రంలో విడిచిపెట్టారు.

ఈ వైరల్ వీడియో పట్ల జంతు ప్రియులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఓ ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేయగా.. 14 వేల వ్యూస్‌కు పైగా రాగా.. 645 మంది లైక్స్ చేశారు. తాబేలును కాపాడి వారు మానవత్వాన్ని చాటుకున్నారంటూ నెటిజన్లు అభినందిస్తున్నారు. సముద్ర తాబేళ్లను రక్షించుకోవాల్సిన బాధ్యత మానవ జాతిపై ఉందంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. తాబేలును రక్షించిన యువకులు పెద్ద మనసును చాటుకున్నారని కొనియాడారు.

Also Read..

YCP VS TDP: ఢిల్లీకి చేరిన ఏపీ ఫైట్.. అమిత్‌షాకు వైసీపీ, టీడీపీ ఎంపీల పోటా పోటీ ఫిర్యాదులు..

Telangana: మిస్టరీ మరణాలు.. చెరువులో దూకి ముగ్గురు యువతుల ఆత్మహత్య