Telangana: మిస్టరీ మరణాలు.. చెరువులో దూకి ముగ్గురు యువతుల ఆత్మహత్య
జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానిక గుట్ట సమీపంలో ఉన్న ధర్మసముద్రం చెరువులో దూకి ముగ్గురు యువతులు ఆత్మహత్య చేసుకున్నారు.
జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానిక గుట్ట సమీపంలో ఉన్న ధర్మసముద్రం చెరువులో దూకి ముగ్గురు యువతులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. మృతులు జగిత్యాలలోని గాంధీనగర్‌కు చెందిన వారిగా గుర్తించారు. దేవి, మల్లిక మృతదేహాలు లభ్యం కాగా.. మరో యువతి వందన మృత దేహం కోసం గాలింపు కొనసాగుతోంది. మృతుల్లో ఇద్దరికి వివాహం కాగా.. మరో యువతి ఇంటర్ చదువుతోంది. వీళ్ల ముగ్గురూ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనేది స్పష్టత రావాల్సి ఉంది. స్వచ్ఛంగా తొణికే.. చెరువు నీటిలో శవాలు తేలియాడాయి. ఇది చూసిన స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమచారం అందించడంతో.. ఘటనా స్థలానికి చేరుకుని సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. అయితే మరో మృతదేహం లభ్యం కావాల్సి ఉంది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.
Also Read:AP Weather: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన