Congress: సీనియర్లపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి.. ఏఐసీసీలోకి తీసుకునే అవకాశం..

తెలంగాణ కాంగ్రెస్‎లోని కీలక నేతల్లో ఉన్న అసంతృప్తిని తొలగించే పనిలో కాంగ్రెస్ అధిష్టానం లీనమైందా ..? పీసీసీ ఆశించి భంగపడ్డ నేతలకు కీలక పదవులను అధిష్ఠానం కట్టబెట్టనుందా.. ఇప్పటికే తెలంగాణ నుంచి ఇద్దర్నీ ఏఐసీసీలోకి తీసుకుంది...

Congress: సీనియర్లపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి.. ఏఐసీసీలోకి తీసుకునే అవకాశం..
Congress
Follow us
TV9 Telugu

| Edited By: Srinivas Chekkilla

Updated on: Oct 28, 2021 | 3:19 PM

తెలంగాణ కాంగ్రెస్‎లోని కీలక నేతల్లో ఉన్న అసంతృప్తిని తొలగించే పనిలో కాంగ్రెస్ అధిష్టానం లీనమైందా ..? పీసీసీ ఆశించి భంగపడ్డ నేతలకు కీలక పదవులను అధిష్ఠానం కట్టబెట్టనుందా.. ఇప్పటికే తెలంగాణ నుంచి ఇద్దర్నీ ఏఐసీసీలోకి తీసుకుంది. అధిష్ఠానం చర్యలతో తెలంగాణ కాంగ్రెస్‎లో వివాదాలు సద్దుమణుగుతాయా.. అధిష్టానం ఇచ్చే పదవులు తెలంగాణ కాంగ్రెస్‎కు మంచి చేస్తాయా ..? లేక చెడు చేస్తాయా..? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ ..

తెలంగాణ పీసీసీ చీఫ్‎గా రేవంత్ రెడ్డిని అధిష్ఠానం నియమించిన తరువాత కాంగ్రెస్ శ్రేణులు కొత్త జోష్ వచ్చిందనే చెప్పాలి. పీసీసీ చీఫ్ పదవి కోసం కొంతమంది నేతలు చివరి వరకు ప్రయత్నం చేసినా అధిష్టానం మాత్రం రేవంత్ రెడ్డికి పదవిని కట్టబెట్టింది. పీసీసీ పదవిని ఆశించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగంగానే పార్టీపై విమర్శలు కూడా చేశారు. నూతన పీసీసీ చీఫ్‎గా పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి రేవంత్ రెడ్డికి ముఖ్య నేతల సహకారం లేకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ముందు నుండి రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వడాన్ని వ్యతిరేకించిన సీనియర్ల వర్గం.. రేవంత్‎పై ప్రతిరోజు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టే కార్యక్రమాలపై సీనియర్ల సలహాలు సూచనలు తీసుకోకుండా ముందుకు వెళుతున్నారని ఫిర్యాదు చేశారు.

రేవంత్ రెడ్డిని పీసీసీ చేసిన తర్వాత అసంతృప్తుల అందర్నీ ఢిల్లీకి పిలిపించిన అధిష్ఠానం బుజ్జగించే ప్రయత్నం చేసింది. అసంతృప్తులను సంతృప్తి పరిచేందుకు ఐసీసీలో కొంతమంది నేతలకు కీలక పదవులు కట్టబెట్టింది. దానిలో భాగంగా జాతీయాంశాలపై ఆందోళనలు చేపట్టేందుకు కమిటీని చేసిన సోనియా గాంధీ ఏర్పాటు చేసింది. కమిటీ ఛైర్మన్‌గా దిగ్విజయ్ సింగ్‎ను నియమించగా సభ్యుల్లో ప్రియాంక గాంధీతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డికి చోటు కల్పించారు. పీసీసీ చీఫ్ కోసం పోటీ పడిన మాజీ ఎమ్మల్యే వంశీచందర్‌రెడ్డికి ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జ్ కార్యదర్శిగా నియమించింది. టీపీసీసీ చీఫ్ పదవి వస్తుందని ఆశించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏఐసీసీలోకి తీసుకునే అవకాశం ఉంది. గతంలోనే కోమటిరెడ్డికి పార్టీ పెద్దలు హామీ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసంతృప్తి నేతలకు పదవులు కట్టబెట్టినంత మాత్రాన తెలంగాణ కాంగ్రెస్‎లో వివాదాలు సద్దుమణుగుతాయా అనేది ఒక పెద్ద ప్రశ్న మారింది.

రేవంత్ రెడ్డి పీసీసీ అయిన నిర్వహించిన కార్యక్రమాలలో ఒకరు ఇద్దరు సీనియర్లు తప్ప మిగిలిన వారు అంతగా పాల్గొన్నది లేదు. రేవంత్ రెడ్డిపై గుర్రుగా ఉన్న సీనియర్లు ఏదో ఒక వంకతో నిత్యం పార్టీ పెద్దలకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఆ సీనియర్ నేతలకు ఇప్పుడు ఏఐసీసీలో బాధ్యతలు ఇచ్చిన తర్వాత సైలెంట్‎గా ఉంటారా లేక రేవంత్‎పై మరింత దూకుడుతో ముందుకు వెళ్తారా అనేది తెలియాల్సి ఉంది. రాష్ట్రంలో ఉన్నప్పుడే నిత్యం ఫిర్యాదులు చేసినా ఆ నేతలు ఏఐసీసీలో పదవీ బాధ్యతలు స్వీకరిస్తే దానిని వారికి అనుకూలంగా మార్చుకుంటారనే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అధిష్ఠానానికి మరింత చేరువైతే రేవంత్ రెడ్డిపై ఫిర్యాదులు చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఏఐసీసీ పదవులతో పార్టీ సీనియర్లు సంతృప్తి చెందుతారా.. లేదా అన్నది వేచి చూడాల్సిందే..

Read Also.. Niranjanreddy: ఏ పంటైనా కొంటామని ఉత్తరం తీసుకురండి.. బీజేపీ నేతలకు మంత్రి నిరంజన్ రెడ్డి సవాల్..

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..