Niranjanreddy: ఏ పంటైనా కొంటామని ఉత్తరం తీసుకురండి.. బీజేపీ నేతలకు మంత్రి నిరంజన్ రెడ్డి సవాల్..
హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. వరి సాగు విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై దీక్ష చేస్తున్నారు. బండి దీక్షపై వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు...
హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. వరి సాగు విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై దీక్ష చేస్తున్నారు. బండి దీక్షపై వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. సాయంత్రం 5 గంటలలోపు కేంద్రం నుంచి తెలంగాణలో యాసంగిలో వేసే ఏ పంటనైనా కొంటామని ఉత్తరం తీసుకురండి అని సవాల్ చేశారు. లేకపోతే బండి సంజయ్, కిషన్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒక వేళ బీజేపీ నేతలు కేంద్రాన్ని ఒప్పిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి నిరంజన్ రెడ్డి తేల్చిచెప్పారు. హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే బీజేపీ దొంగ దీక్షలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో వరి పంట వేయటంపై గందరగోళం నెలకొంది. యాసంగి సాగుపై జరిగిన సమీక్షా సమావేశంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ వరి విత్తనాలు అమ్మొద్దని వ్యాపారులను హెచ్చరించారు. దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. సిద్దిపేట కలెక్టర్ న్యాయవ్యవస్థను కించపరిచేలా మాట్లాడరని, రాజ్యాంగ పదవిలో ఉండి అలా మాట్లాడటం సరికాదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు అన్నారు. అయితే వరి పంట వేసుకోవచ్చని కరీంనగర్ జిల్లా కలెక్టర్ తెలిపారు. వరి పంట వేస్తే కొనే పరిస్థితిలేదని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. వరి వేసుకోవచ్చని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. కలెక్టర్, మంత్రులపై వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇదే విషయమై బీజేపీ రాష్ట్ర బండి సంజయ్ ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేస్తున్నారు. దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి బీజేపీ నేతలకు సవాల్ విసిరారు.
Read Also.. Huzurabad Bypoll Updates: జోరుగా తెరచాటు రాజకీయం లైవ్ వీడియో