AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Food Adulteration: మీరు వాడుతున్న టీ పొడి స్వచ్ఛమైనదేనా?..ఇలా గుర్తించండి..

ప్రజల అవసరం, డిమాండ్ ను ఆసరాగా చేసుకుని కొందరు ఆహార పదార్థాలను కల్తీ చేసి..

Food Adulteration: మీరు వాడుతున్న టీ పొడి స్వచ్ఛమైనదేనా?..ఇలా గుర్తించండి..
Basha Shek
|

Updated on: Oct 29, 2021 | 8:42 AM

Share

ప్రజల అవసరం, డిమాండ్ ను ఆసరాగా చేసుకుని కొందరు ఆహార పదార్థాలను కల్తీ చేసి విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దురదృష్టవశాత్తూ వీటిని కొనుగోలు చేసేటప్పుడు ఎవరూ దీనిని గుర్తించలేకపోతున్నారు. ఫలితంగా కల్తీ ఆహార పదార్థాలతో పలు ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కల్తీకి కళ్లెం వేయడానికి ‘భారత ఆహార భద్రత నాణ్యతా ప్రమాణాల సంస్థ(FSSAI)’ నడుం బిగించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ‘డిటెక్టింగ్‌ ఫుడ్‌ అడల్ట్రెంట్స్‌’ పేరుతో సోషల్‌ మీడియా ద్వారా ఆహార పదార్థాల్లోని కల్తీని గుర్తించడమెలాగో ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. అలా తాజాగా టీ పొడిలోని కల్తీని సులభంగా గుర్తించే ఓ వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేసుకుంది. ఆ వివరాలు తెలుసుకుందాం రండి.

తేయాకులోని స్వచ్ఛతను కనుక్కోండిలా.. 1.తేయాకులోని కల్తీని గుర్తించేందుకు ముందుగా ఫిల్టర్‌ పేపర్‌ తీసుకుని వాటిపై తేయాకులను ఉంచాలి. 2.ఆతర్వాత ఫిల్టర్‌ పేపర్‌పై తేమ వచ్చేందుకు కొద్దిగా నీళ్లు చల్లాలి. 3.అనంతరం ట్యాప్‌ వాటర్‌ కింద పేపర్‌ను పెట్టి కడగాలి. 4.లైటింగ్‌లో పేపర్‌పై ఏమైనా మరకలు ఉన్నాయేమో గుర్తించాలి. తేయాకు స్వచ్ఛమైనదైతే ఫిల్టర్‌ పేపర్‌పై ఎలాంటి మరకలు ఉండవు. 5.ఒకవేళ తేయాకులో ఇతర పదార్థాలు కలిపి ఉంటే పేపర్‌పై నలుపు- గోధుమ రంగు కలబోసిన మరకలు కనిపిస్తాయి.

Also Read:

Aloe Vera: వీళ్లు కలబందను తీసుకోవడం చాలా ప్రమాదం.. ఎందుకో తెలుసుకోండి..

Health: శరీరంలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా..? అయితే మీరు సరిపడ నీటిని తాగడం లేదని అర్థం..

Life Style: మీ దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగాలంటే ఇవి తప్పనిసరి.. భర్తలూ ఇది మీ కోసమే..