Kisan Credit Card: కిసాన్ క్రెడిట్ కార్డుతో తక్కువ వడ్డీతో రూ. 3 లక్షల వరకు ఋణం పొందండి.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
SBI Kisan Credit Card: అన్నదాత వ్యవసాయం చేయడానికి డబ్బులు అవసరం పడతాయి. అటువంటి రైతు ఎస్బీఐ బ్యాంకు ఖాతాదారుడైతే.. సాగు ఖర్చుల..
SBI Kisan Credit Card: అన్నదాత వ్యవసాయం చేయడానికి డబ్బులు అవసరం పడతాయి. అటువంటి రైతు ఎస్బీఐ బ్యాంకు ఖాతాదారుడైతే.. సాగు ఖర్చుల నిమిత్తం వ్యవసాయ ఋణం పొందడం ఈజీ.. రైతు వ్యవసాయం కోసం దేశీయ అతి పెద్ద బ్యాంక్ SBI అన్నదాతకు అండగా నిలవడానికి కిసాన్ క్రెడిట్ కార్డ్ ను అందిస్తోంది. ఈ కార్డు సహాయంతో రైతు తన వ్యవసాయానికి సంబంధించిన ఖర్చుల నిమిత్తం సులభంగా ఋణం పొందవచ్చు.. ఈ కార్డు గురించి వివరాలు తెలుసుకుందాం..
లక్షణాలు, ప్రయోజనాలు: 1. SBI కిసాన్ ఖాతా.. క్యాష్ క్రెడిట్ ఖాతాలా ఉంటుంది. 2. ఖాతాలో క్రెడిట్ బ్యాలెన్స్ ఏదైనా ఉంటే, సేవింగ్స్ బ్యాంక్ రేటు వద్ద వడ్డీని పొందుతారు. 3. వ్యవధి: 5 సంవత్సరాలు, ప్రతి సంవత్సరం వార్షిక సమీక్ష అనంతరం 10% వార్షిక పెంచుతారు 4. వడ్డీ రాయితీ: 3 లక్షల వరకూ సత్వర రుణం.. రుణ గ్రహీతలకు 3% వడ్డీ రాయితీ. 5. తిరిగి చెల్లింపు: పంట కాలం (స్వల్ప/దీర్ఘ), పంటకు మార్కెటింగ్ వ్యవధిపై తిరిగి చెల్లించే వ్యవధి ఆధారపడి ఉంటుంది.
భీమా: 70 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న KCC రుణగ్రహీతలు వ్యక్తిగత ప్రమాద భీమా పథకం (PAIS) కింద కవర్ చేయబడతారు అర్హత కలిగిన పంటలు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద కవర్ చేయబడతాయి.
వడ్డీ రేటు: 1. రూ. 3లక్షల వరకూ రుణం తీసుకునే వారికి వడ్డీ రేటు 7 శాతం. 2. రూ.3 లక్షల పైన రుణం తీసుకునే వారికి ఎప్పటికప్పుడు వడ్డీ రేటు వర్తించే విధంగా
ఇతర ఫీచర్లు/ప్రయోజనాలు: 1. అర్హులైన KCC రుణగ్రహీతలందరూ SBI నుంచి కిసాన్ క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. 2. Rupay కార్డులు హోల్డర్‌లకు ఒక లక్ష భీమా.. 45 రోజులకు ఒకసారి రెన్యువల్..
దరఖాస్తు చేసుకునే విధానం:
నేరుగా ఎస్బిఐ బ్యాంక్ శాఖకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. SBI ఆన్ లైన్ నుంచి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు.
అవసరమైన పత్రాలు:
గుర్తింపు కార్డుకు సంబంధించిన ఆధార్ కార్డు, లేదా ఓటర్ ఐడీ, తదితర గుర్తింపు కార్డులు వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలు ధరఖాస్తుదారుడి ఫోటోలు ఇంటి చిరునామా
Also Read: థర్డ్‌వేవ్ ముంగిట భారత్.. పలు రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కేసులు..