Third Wave in India: థర్డ్‌వేవ్ ముంగిట భారత్.. పలు రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కేసులు..

Third Wave in India: భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గినప్పటికీ.. థర్డ్ వేవ్ ముప్పు ప్రపంచ ఆరోగ్య సంస్థ, నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ కొత్త..

Third Wave in India: థర్డ్‌వేవ్ ముంగిట భారత్.. పలు రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కేసులు..
Telangana Corona
Follow us

|

Updated on: Oct 29, 2021 | 8:04 AM

Third Wave in India: భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గినప్పటికీ.. థర్డ్ వేవ్ ముప్పు ప్రపంచ ఆరోగ్య సంస్థ, నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ కొత్త వేరియంట్ AY.4.2 దేశంలో పలు రాష్ట్రాల్లో వెలుగు చూడడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కొత్త AY.4.2 వేరియంట్.. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణ , జమ్మూ , కాశ్మీర్‌ల్లో వెలుగులోకి వచ్చింది. ఈ వేరియంట్‌కు సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఈ కొత్త వేరియంట్‌.. సెకండ్‌ వేవ్‌ సమయంలో తీవ్ర నష్టం కలిగించిన డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కుటుంబానికి చెందినదని, ఈ వేరియంట్‌తో కరోనా థర్డ్‌ వేవ్‌ వచ్చే అవకాశం అధికంగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అధికారులు ఈ కొత్త వేరియంట్‌ గురించి పరిశోధిస్తున్నారు. మరోవైపు మహారాష్ట్రలో మళ్ళీ కోవిడ్-19 కేసులు స్వల్పంగా పెరిగాయి.

దేశంలో మొదటి వ్యాక్సినేషన్ డోసు తీసుకున్నవారు.. రెండో డోసు తీసుకొనే సమయం దాటిపోయినా  తీసుకోవడం లేదని.. ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తుంది. కోవిడ్-19 వ్యాక్సిన్‌ని సుమారు 11 కోట్ల మంది ప్రజలు గడువు దాటినా తమ రెండవ డోసు తీసుకోలేదని తెలిపింది. మొదటి డోసు తీసుకున్నవారికి రెండో డోసు టీకాలు వేయడానికి రెండు వారాల వరకు గడువు ఉంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇదే విషయంపై పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది. ఇంకా రెండవ డోస్ తీసుకోని లబ్ధిదారులకు రెండవ డోస్ ఇవ్వడానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరింది

Also Read:  నేటి రాశిఫలాలు.. ఈరోజు ఈ రాశివారు కొత్త భూములు కొనుగోలు చేసే అవకాశం..