America: అమెరికాలో మళ్లీ కాల్పులు.. ఏడుగురు మృతి.. ఆ ఘటనను మరవకముందే..

అగ్రరాజ్యం అమెరికా.. తుపాకీ మోతతో దద్దరిల్లుతోంది. రెండు రోజుల క్రితం ఓ పార్కులో దుండగుడు జరిపిన కాల్పుల ఘటనను మరిచిపోకముందే.. ఇప్పుడు మరోసారి అలాంటి ఘటనే జరిగింది. కాలిఫోర్నియాలోని..

America: అమెరికాలో మళ్లీ కాల్పులు.. ఏడుగురు మృతి.. ఆ ఘటనను మరవకముందే..
Us Firing
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jan 24, 2023 | 8:43 AM

అగ్రరాజ్యం అమెరికా.. తుపాకీ మోతతో దద్దరిల్లుతోంది. రెండు రోజుల క్రితం ఓ పార్కులో దుండగుడు జరిపిన కాల్పుల ఘటనను మరిచిపోకముందే.. ఇప్పుడు మరోసారి అలాంటి ఘటనే జరిగింది. కాలిఫోర్నియాలోని హాఫ్‌మూన్‌ బే ప్రాంతంలో రెండుచోట్ల దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరికొంతమందికి గాయాలయ్యాయి. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలానికి చేరుకుని స్పాట్ ను పరిశీలించారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

కాగా.. రెండు రోజుల క్రితం కూడా అమెరికాలో అలాంటి ఘటనే జరిగింది. లాస్‌ఏంజెల్స్‌ సమీపంలోని మాంటేరీ పార్క్‌లో కాల్పులు చోటు చేసుకున్నాయి. శనివారం రాత్రి 10 గంటల సమయంలో ఓ వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. చైనీయుల లూనార్‌ న్యూఇయర్‌ ఫెస్టివల్‌ వేడుకలు జరుగుతండగా.. ఈ ఘటన జరగడం తీవ్ర విషాదం నింపింది. కాల్పుల్లో సుమారు పది మంది వరకు మృతి చెంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు. అయితే కాల్పులు చేపట్టిన వ్యక్తి సూసైడ్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరోవైపు.. చికాగోలో ఇద్దరు తెలుగు విద్యార్ధులపై కాల్పులు జరిగాయి. విజయవాడకు చెందిన దేవాన్ష్‌ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. గవర్నర్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న కొప్పాల సాయి చరణ్‌ ఈ కాల్పుల్లో గాయపడ్డాడు. ఛాతీ భాగంలో బుల్లెట్ దిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అతనికి చికిత్స అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!