Worlds Most Expensive Fruit:ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండు.. ఒక్కోగెల ఖరీదు రూ. 10 లక్షలు..

ఈ పండు ఎప్పుడూ ఖరీదైన పండ్ల జాబితాలోనే ఉంటుంది. రూబీ రోమన్ ద్రాక్ష అధిక ధర కారణంగా, ఇది సూపర్ మార్కెట్లలో మాత్రమే లభిస్తుంది.

Worlds Most Expensive Fruit:ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండు.. ఒక్కోగెల ఖరీదు రూ. 10 లక్షలు..
Worlds Most Expensive Fruit
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 24, 2023 | 10:11 AM

రూబీ రోమన్ గ్రేప్స్: పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కాబట్టి, సీజన్‌ను బట్టి పండ్లు తినాలని చెబుతారు వైద్యులు. మనం సాధారణంగా యాపిల్, బొప్పాయి, ద్రాక్ష, దానిమ్మ పండ్లు కొంటాం. యాపిల్స్ ఖరీదు దాదాపు 100 నుంచి 150 రూపాయలు. ద్రాక్ష ధర 60 నుంచి 100 రూపాయల వరకు ఉంటుంది. దానిమ్మ 100 నుండి 120 రూపాయల ధరలో కూడా లభిస్తుంది. అయితే, ఇలాంటి పండ్లలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండు ఒకటి ఉందని మీకు తెలుసా..? ఆ పండు ఒక గెల ఖరీదు 10 లక్షల రూపాయలు. అవును నిజమే..! ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండుగా పరిగణించబడుతుంది. ఇదేంటో వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

జపాన్‌కు చెందిన రూబీ రోమన్ ద్రాక్ష ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లలో ఒకటి. దాని ఎరుపు రంగు కారణంగా, దీనిని రూబీ రోమన్ గ్రేప్స్ అని పిలుస్తారు. రూబీ రోమన్ ద్రాక్ష విలువ కారణంగా ప్రపంచ రికార్డు బుక్‌లో చోటు సంపాదించింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండు అనే గుర్తింపును పొందింది. 2020లో జపాన్‌లో రూబీ రోమన్ ద్రాక్ష గుత్తి $12,000 (సుమారు రూ. 9.76 లక్షలు)కి వేలం వేయబడింది.

నివేదికల ప్రకారం రూబీ రోమన్ ద్రాక్ష గెల విలువ రూ.10 లక్షలు. ఈ రూబీ రోమన్ ద్రాక్షను హ్యోగో ప్రిఫెక్చర్‌లోని అమగాసాకిలోని సూపర్ మార్కెట్‌లో విక్రయించారు. ఈ పండు ఎప్పుడూ ఖరీదైన పండ్ల జాబితాలోనే ఉంటుంది. రూబీ రోమన్ ద్రాక్ష అధిక ధర కారణంగా, ఇది సూపర్ మార్కెట్లలో మాత్రమే లభిస్తుంది. జపాన్‌లో ఈ ఖరీదైన పండ్లను వారివారి దగ్గరివారికి, ప్రియమైన వారికి ఇచ్చుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో, వివాహాది శుభకార్యక్రమాల్లో సమర్పించటం ఇక్కడ ఒక సంప్రదాయం.

ఇవి కూడా చదవండి

జపాన్‌లోని పండ్లు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా కఠినమైన తనిఖీ ప్రక్రియ ద్వారా విక్రయించబడతాయి. అక్కడ ద్రాక్షను మూడు వర్గాలుగా విభజించారు. మొదటిది సుపీరియర్, స్పెషల్ సుపీరియర్, మూడవది ప్రీమియం. ప్రీమియం గ్రేడ్ పొందడానికి ద్రాక్ష ఖచ్చితంగా ఉండాలి. రూబీ రోమన్ ద్రాక్ష రెండు బ్యాచ్‌లను 2021 సంవత్సరంలో ప్రీమియం గ్రేడ్‌లో ఉంచినట్లు ఒక నివేదిక పేర్కొంది. 2019 – 2020 సంవత్సరాల్లో ఏ పండు కూడా అర్హత పొందలేదు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?