ఛీఛీ.. వీళ్లసలు తల్లిదండ్రులేనా.. ఉద్యోగం పోతుందనే భయంతో.. పిల్లలను కాల్వలో పడేశారు..
అతనికి తోడుగా భార్య కూడా సహకరించింది. దంపతులు ఇద్దరూ కలిసి చిన్నారిని కాల్వలోకి విసిరేశారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం జరిగినట్టుగా తెలిసింది. అయితే,ఎలాగోలా విషయం పోలీసులకు చేరింది.
రాజస్థాన్‌లో దారుణ సంఘటన వెలుగు చూసింది. ఇది తెలిసిన ప్రతిఒక్కరూ నిర్ఘంతా పోతున్నారు. రాజస్థాన్ ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి తన 5 నెలల కూతురిని కాలువలో పడేశాడు. పర్మినెంట్ ఉద్యోగానికి ఎలాంటి ఆటంకం కలగకూడదని కాంట్రాక్టు కార్మికుడు తన కుమార్తెను ఇందిరాగాంధీ కెనాల్‌లో పడేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేరంలో అతని భార్య కూడా తన భర్తకు మద్దతుగా నిలిచింది. విషయం వెలుగులోకి రావటంతో పోలీసులు దంపతులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన బికనీర్ జిల్లా ఛతర్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బికనీర్ జిల్లా ఛతర్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఓ 36 ఏళ్ల వ్యక్తి, అతని భార్య కలిసి దారుణానికి ఒడిగట్టారు. ప్రభుత్వ ఉద్యోగంపై దురాశతో తమ ఐదు నెలల కుమార్తెను కాలువలోకి విసిరేరారు. రాజస్థాన్‌లో ముగ్గురు పిల్లల వల్ల తన ఉద్యోగంలో సమస్యలు ఎదురవుతాయని భయపడ్డాడు.
స్థానికంగా నివసిస్తున్న ఝవర్‌లాల్ మేఘవాల్ రాజస్థాన్ ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతనికి ముగ్గురు పిల్లలు. ఈ కారణంగా ఎక్కడ అతని ఉద్యోగం పోతుందోననే భయంతో.. ముక్కుపచ్చలారని చిన్నారిని అడ్డుతొలగించుకోవాలని చూశాడు. ఇద్దరు పిల్లలు మాత్రమే ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం తనను పర్మినెంట్ సర్వీస్ చేస్తుందని ఆశించాడు. అతనికి తోడుగా భార్య కూడా సహకరించింది. దంపతులు ఇద్దరూ కలిసి చిన్నారిని కాల్వలోకి విసిరేశారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం జరిగినట్టుగా తెలిసింది.
అయితే,ఎలాగోలా విషయం పోలీసులకు చేరింది. తమ కుమార్తెను హత్య చేసిన కేసులో దంపతులను అరెస్టు చేసినట్లు బికనీర్ ఎస్పీ యోగేష్ యాదవ్ తెలిపారు. విచారించగా, పర్మినెంట్ ఉద్యోగంపై దురాశతోనే ఇలాంటి భయంకర నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు. దీంతో పోలీసులు ఝవర్‌లాల్ మేఘ్‌వాల్, అతని భార్య గీతాదేవిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..