హైవేపై రీల్స్ చేస్తూ హల్‌చల్‌ చేసిన బ్యూటీ..! వీడియో వైరల్ కావటంతో కథ అడ్డం తిరిగింది..!

ఆమెకు 6.5 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. హైవే మధ్యలో కారును ఆపి రకరకాల భంగిమల్లో వీడియో చిత్రీకరించి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసింది. వీడియో వైరల్ కావడంతో పోలీసులు చర్యలు చేపట్టారు.

హైవేపై రీల్స్ చేస్తూ హల్‌చల్‌ చేసిన బ్యూటీ..! వీడియో వైరల్ కావటంతో కథ అడ్డం తిరిగింది..!
Instagram Viral
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 24, 2023 | 7:17 AM

ఇటీవల క్రేజీ రీల్స్ చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ముఖ్యంగా ఆడపిల్లలు ఎక్కడపడితే అక్కడ రీళ్లు వేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్  వీడియోలు, రీల్స్, చిన్న వీడియోల సంఖ్య పెరుగుతోంది. లైకుల కోసం యువతీ యువకులు బహిరంగంగానే సరసాలాడడం కొందరిని కలవరపెడుతోంది. అంతా అయిపోయినా తర్వాత పోలీసులు అతిథిగా రావాల్సిందే. ఇప్పుడు ఓ యువతి కూడా అలాంటి రీల్స్‌ చేసి చిక్కుల్లో పడింది. 17 వేల జరిమానా విధించి రీల్స్‌ తయారు చేసిన బ్యూటీకి షాక్ ఇచ్చిరు పోలీసులు. అసలు ఈ స్టోరీ ఏంటని వివరాల్లోకి వెళ్లి చూస్తే..

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన వైశాలి చౌదరి అనే ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ రీల్స్‌ చేసినందుకు జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోడ్డు భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు గాజియాబాద్ పోలీసులు ఆమెకు జరిమానా విధించారు. హైవే మధ్యలో కారును ఆపి రకరకాల భంగిమల్లో వీడియో చిత్రీకరించి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసింది. వీడియో వైరల్ కావడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ ఘటన సాహిబాబాద్‌లో చోటుచేసుకుంది.

ఇవి కూడా చదవండి

వైశాలి చౌదరి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంతో ఫేమస్‌.. ఆమెకు 6.5 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. వైశాలి చౌదరి ఇప్పుడు చేసిన ఈ వీడియో మరింత వైరల్‌గా మారింది.

మరిన్ని వైరల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..