Trending Video: కదులుతున్న కారులో ప్రేమజంట నిర్వాకం.. అందరికీ కనిపించేలా రొమాన్స్.. మండిపడుతున్న నెటిజన్లు..

నడిరోడ్లపై యువత రెచ్చిపోతున్నారు. ముందూ వెనకా చూడకుండా ఇష్టమొచ్చినట్లు బిహేవ్ చేస్తున్నారు. మమ్మల్నెవడురా ఆపేది అన్నట్లుగా బరి తెగిస్తున్నారు. తాజాగా బైక్ లపై రొమాన్స్ చేసుకుంటున్న వీడియోలు సోషల్...

Trending Video: కదులుతున్న కారులో ప్రేమజంట నిర్వాకం.. అందరికీ కనిపించేలా రొమాన్స్.. మండిపడుతున్న నెటిజన్లు..
Romance In Car
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jan 24, 2023 | 6:40 AM

నడిరోడ్లపై యువత రెచ్చిపోతున్నారు. ముందూ వెనకా చూడకుండా ఇష్టమొచ్చినట్లు బిహేవ్ చేస్తున్నారు. మమ్మల్నెవడురా ఆపేది అన్నట్లుగా బరి తెగిస్తున్నారు. తాజాగా బైక్ లపై రొమాన్స్ చేసుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి కూడా అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. కారులో ప్రయాణిస్తున్న ఓ జంట.. వాహనానికి ఉన్న సన్ రూఫ్ ఓపెన్ చేసి.. అందులో నుంచి బయటకు వచ్చి రొమాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. వైరల్ క్లిప్‌ను ప్రియా సింగ్ అనే ఇంటర్నెట్ యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. బైక్‌ల తర్వాత, కదులుతున్న కారులో బహిరంగ ప్రేమ అని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.

వీడియోలో.. హ్యుందాయ్ వెర్నా సెడాన్‌లో ఒక జంట వాహనం నడుస్తున్నప్పుడు సన్‌రూఫ్ నుంచి బయటకు వచ్చి ఒకరినొకరు కౌగిలించుకోవడాన్ని చూడవచ్చు. ఈ దృశ్యాలను వెనక వాహనంలో వస్తున్న వ్యక్తి రికార్డ్ చేశాడు. దీనిని గమనించిన కారు డ్రైవర్.. వీడియో తీసిన వ్యక్తిని బెదిరించి, ఆ వీడియోను డిలీట్ చేయించడం గమనార్హం. రోడ్డు భద్రతా ప్రోటోకాల్‌లను ఉల్లంఘించినందుకు, తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించినందుకు పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

క్లిప్ ఇంటర్నెట్‌లో షేర్ అయినప్పటి నుంచి చాలా తక్కువ సమయంలో అనేక వ్యూస్, లైక్‌లు పొందింది. వీడియో చూసిన తర్వాత నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు. ఇలాంటి పనులు చేయడం సరికాదని, వీడియోకు ఉత్తర ప్రదేశ్ పోలీసుల ట్విట్టర్ హ్యాండిల్‌ను ట్యాగ్ చేసి, చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే