వీడేం వరుడండి బాబు..! 10రూపాయల నోట్లు కూడా లెక్కించలేకపోయాడు..!! అదేంటంటే..

పెళ్లి కొడుకు ఆ చిన్న పనిని కూడా చేయలేకపోయాడు. దాంతో పెళ్లి కూతురు అతనితో పెళ్లికి నిరాకరించింది.పెళ్లి ఆగిపోవడంతో వరుడు, వధువు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

వీడేం వరుడండి బాబు..! 10రూపాయల నోట్లు కూడా లెక్కించలేకపోయాడు..!! అదేంటంటే..
Wedding
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 23, 2023 | 2:18 PM

వివాహ సమయంలో వరుడిపై అనుమానం వచ్చిన పురోహితుడు..అతనికి ఓ పరీక్ష పెట్టాడు.. దాంతో పెళ్లి కొడుకు అసలు సంగతి బయటపడింది.. దాంతో ఈ పెళ్లి నాకొద్దని తేల్చి చెప్పింది పెళ్లి కూతురు..ఉత్తరప్రదేశ్ లో ఫరూఖాబాద్ లో జరిగింది ఒక అసాధారణ సంఘటన.. పెళ్లి సమయంలో వధువు వేదిక నుంచి వెళ్లిపోయిందని, దీంతో కుటుంబాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వరుడు 10 రూపాయల నోట్లు లెక్కించడంలో విఫలమవడంతో వధువు తన పెళ్లి రద్దు చేసుకుంది. దీంతో ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో ఇలాంటి షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. వధువు కుటుంబీకులు వరుడికి 10 రూపాయల 30 నోట్లను ఇచ్చి పరీక్షించారు. వారు నోట్లను లెక్కించి మొత్తం చెప్పమని అడిగారు. 23 ఏళ్ల వరుడు అలా చేయడంలో ఘోరంగా విఫలమయ్యాడు. అతను మానసికంగా బలహీనంగా ఉన్నాడని వధువు కుటుంబం ఆరోపించింది. వరుడు మానసిక స్థితి తెలిసిన వెంటనే 21 యేండ్ల వధువు రీటా సింగ్ వేదిక నుంచి వెళ్లిపోయింది. దీంతో ఇది రెండు కుటుంబాల మాటల వాగ్వాదానికి దారి తీసింది.

పెళ్లికూతురు సోదరుడు మోహిత్‌ మాట్లాడుతూ.. దగ్గరి బంధువు ద్వారా పెళ్లి కుదిరిందని, అతడిని నమ్మి పెళ్లి చేసుకున్న వ్యక్తిని సరిగా కలవలేదని, వరుడి ప్రవర్తన గురించి పూజారి మాకు తెలియజేశారని, అతడికి సులువైన పరీక్ష పెట్టాలని నిర్ణయించుకున్నామని, నేను అతడిని అడిగాను. మొత్తం 30 పది రూపాయల నోట్లను లెక్కించి చెప్పండి. అతను అలా చేయడంలో విఫలమయ్యాడు. నా సోదరి అతనిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించింది.పెళ్లి ఆగిపోవడంతో వరుడు, వధువు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మధ్యవర్తిత్వం వహించేందుకు ప్రయత్నించినా పెళ్లికి వధువు సిద్ధపడలేదు. చివరికి ‘బారాత్’ తిరిగి వెళ్లి పోవాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..