Zomato Scam: వామ్మో.. జొమాటోలో ఇంత మోసం జరుగుతోందా.? డెలివరీ బాయ్స్ అతి తెలివితో సంస్థకు పెద్ద లాస్..
'గోల్‌మాల్ గోవిందా.. మోసం జరగని చోటుందా'.. ఇది తెలుగు సినిమాలోని ఓ పాట. అయితే సమాజంలో జరిగే కొన్ని మోసాలు చూస్తుంటే ఈ లైన్స్ అక్షర సత్యాలు అనిపిస్తున్నాయి. ఏదో ఒక చిన్న లూప్ హోల్‌తో కొందరు అతి తెలివితో మోసం చేస్తున్నారు. తాజాగా జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ ఇలా..
‘గోల్‌మాల్ గోవిందా.. మోసం జరగని చోటుందా’.. ఇది తెలుగు సినిమాలోని ఓ పాట. అయితే సమాజంలో జరిగే కొన్ని మోసాలు చూస్తుంటే ఈ లైన్స్ అక్షర సత్యాలు అనిపిస్తున్నాయి. ఏదో ఒక చిన్న లూప్ హోల్‌తో కొందరు అతి తెలివితో మోసం చేస్తున్నారు. తాజాగా జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ ఇలాగే తిన్నింటి వాసాలు లెక్కపెట్టాడు. పనిచేస్తున్న సంస్థకు నష్టం వాటిల్లేలా చేశాడు. ఉత్తరాఖండ్‌కు చెందిన వినయ్ సతి అనే ఓ ఎంట్రపెన్యూర్ తనకు ఎదురైన ఓ సంఘటనను పంచుకున్నారు. దీంతో జొమాటోలో జరుగుతోన్న మోసం బయటపడింది. ఇంతకీ విషయం ఏంటంటే..
వినయ్ సతి అనే ఎంట్రప్రెన్యూర్ కొన్ని రోజుల క్రితం జొమాటోలో ఫుడ్‌ను ఆర్డర్ చేశారు. ఆర్డర్ చేసిన కొంతసేపటి తర్వాత డెలివరీ బాయ్ ఫుడ్‌ని తీసుకొని వచ్చాడు. ఆ సమయంలో ఫుడ్ డెలివరీ బాయ్ వినయ్‌తో మాట్లాడుతూ.. ‘ సార్ మీరు ఇకపై ఫుడ్ ఆర్డర్ చేసేప్పుడు ఆన్‌లైన్‌లో పేమెంట్ చేయకండి. క్యాషన్ డెలివరీ చేయండి. మీరు రూ. 800 రూపాయిలు విలువ చేసే ఫుడ్ ఆర్డర్ పెట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకోండి. కానీ మీరు నాకు రూ. 300 మాత్రమే చెల్లించడి. నేను ఫుడ్ డెలివరీ జరగలేదని జొమాటోకు రిక్వెస్ట్ చేస్తాను. దీంతో మీరు ఎంచక్కా రూ. 800 ఫుడ్‌ను రూ. 300కే పొందొచ్చు’ అని తెలిపాడు. దీంతో వినయ్ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. జొమాటోలో ఇంత పెద్ద మోసం జరుగుతుందా అని అనుకున్నాడు.
దీనంతటినీ లింక్‌డిన్‌లో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఈ టాపిక్ నెట్టింట వైరల్ అవుతోంది. సాధారణంగా ఏదైనా కారణాలతో ఫుడ్ డెలివరి చేయకలేపోతే డెలివరీ బాయ్స్ ఆ ఫుడ్‌ను తిరిగి హోటల్‌కు తీసుకెళ్లరు. ఇదే లూప్ హోల్‌ను ఉపయోగించి జొమాటో డెలివరీ బాయ్స్ సంస్థను మోసం చేస్తున్నారు. ఇక ఈ విషయాన్ని నెటిజన్లతో పంచుకున్న వినయ్.. జొమాటోలోని డెలివరీ బాయ్స్ భారీగా మోసం చేస్తున్నారని, ఎలా మోసం చేయాలో సలహా ఇచ్చారని, జొమాటోలో స్కామ్ జరుగుతోందని విని నాకు గూస్‌బంప్స్ వచ్చాయని రాసుకొచ్చారు.
ఇక, జొమాటో డెలివరీ బాయ్ చెప్పినట్లు ఆఫర్‌ను ఎంజాయ్ చేయాలా? లేదంటే మోసాన్ని బహిర్గతం చేయాలా? అని ప్రశ్నించారు. నేను ఎంట్రప్రెన్యూర్‌ను కాబట్టి సెకండ్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకున్నానని.. అందుకే మీ ముందుకు వచ్చానంటూ ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే ఉంటే ఈ పోస్ట్ పై జొమాటో సీఈవో గోయల్ సైతం స్పందించారు. ఈ స్కామ్ పై స్పందిస్తూ.. కంపెనీలో కొన్ని లోపాలు ఉన్నాయని వాటిని సరిచేసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..