Viral Video: మొదలైన 6 నిమిషాలకే మ్యాచ్‌ను రద్దు చేసిన అంపైర్లు.. అసలు కారణం ఏంటో తెలిస్తే అవాక్కవుతారు.

క్రికెట్ మొదలు ఫుట్‌బాల్‌ వరకు అవుట్ డోర్‌ గేమ్స్‌ ఏవైనా వాతావరణ పరిస్థితిలపైనే ఆధారపడి ఉంటాయి. వాతావరణం ఏమాత్రం అనుకూలించకపోయినా అంపైర్లు వెంటనే మ్యాచ్‌ను రద్దు చేస్తారు. సాధారణంగా వర్షం కురియడం లేదా లైటింగ్ కారణంగా మ్యాచ్‌లు...

Viral Video: మొదలైన 6 నిమిషాలకే మ్యాచ్‌ను రద్దు చేసిన అంపైర్లు.. అసలు కారణం ఏంటో తెలిస్తే అవాక్కవుతారు.
Viral Video
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 23, 2023 | 4:48 PM

క్రికెట్ మొదలు ఫుట్‌బాల్‌ వరకు అవుట్ డోర్‌ గేమ్స్‌ ఏవైనా వాతావరణ పరిస్థితిలపైనే ఆధారపడి ఉంటాయి. వాతావరణం ఏమాత్రం అనుకూలించకపోయినా అంపైర్లు వెంటనే మ్యాచ్‌ను రద్దు చేస్తారు. సాధారణంగా వర్షం కురియడం లేదా లైటింగ్ కారణంగా మ్యాచ్‌లు రద్దు కావడం సర్వసాధారణమైన విషయమే. అయితే తాజాగా ఓ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ రద్దుకు కారణం ఏంటో తెలిస్తే మాత్రం ఆశ్చర్యానికి గురికావాల్సిందే.

ఇంతకీ విషయమేంటంటే.. లివర్‌పూల్‌, చెల్సియా మహిళా జట్ల మధ్య ఇటీవల ఓ సూపర్ లీగ్ మ్యాచ్‌ జరిగింది. రెండు జట్ల మధ్య ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ ప్రారంభమైంది. అయితే పిచ్‌లో జరిగిన కొన్ని సంఘటనలు చూసిన వెంటనే అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. గ్రౌండ్‌ తడిగా ఉండడమో, మరే కారణమో కానీ ప్లేయర్స్‌ జారడం మొదలైంది. మ్యాచ్‌ ఆడుతోన్న సమయంలో ప్లేయర్స్‌ మాటి మాటికి కిందపడిపోయారు. ఎవరి ప్రమేయం లేకుండానే ప్లేయర్స్‌ జారిపడ్డారు. దీంతో దీనిని గమనించిన అంపైర్‌ వెంటనే మ్యాచ్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మంచు కురవడం వల్లే ఈ సమస్య తలెత్తినట్లు అధికారులు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ప్లేయర్స్‌ మాటిమాటికి పడిపోతుండడంతో నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే దీనికి గల కారణం ఏంటన్నది తెలియలేదు. మ్యాచ్‌ రద్దు కావడంపై చెల్సియా జట్టుకు చెందిన ఫ్రాన్‌ కిర్బీ అనే ప్లేయర్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ఈ విషయమై ఆమె స్పందిస్తూ.. ‘ఈ రోజు మ్యాచ్‌ చూద్దామని వచ్చిన ప్రేక్షకులకు క్షమాపణాలు. క్రీడాకారుల రక్షణే మొదటి ప్రాధాన్యత. అదృష్ణవశాత్తు ఈ రోజు ఏ ప్లేయర్‌కి కూడా గాయాలు కాలేవు. మ్యాచ్‌ రద్దు నిర్ణయం సరైంది’ అంటూ రాసుకొచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..