ఇది కోస్తా కోళ్లపందెం కాదు.. ‘రక్త క్రీడ’.. విజేతకు బెస్ట్‌కాక్‌ ట్రోఫితో పాటు ప్రశంసా పత్రం..

అప్పుడే వాటికి పోటీలో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. టోర్నీకి ప్రవేశ రుసుము రూ.1,200గా నిర్ధారించారు. కాగా, ఈ యేడు పోటీలో గెలుపొందిన పందెం కోడి యజమాని విజయ్‌కు 'బెస్ట్ కాక్' ట్రోఫీని,ప్రశంసా పత్రాన్ని అందజేశారు నిర్వాహకులు.

ఇది కోస్తా కోళ్లపందెం కాదు.. 'రక్త క్రీడ'.. విజేతకు బెస్ట్‌కాక్‌ ట్రోఫితో పాటు ప్రశంసా పత్రం..
Cockfighting
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 23, 2023 | 12:28 PM

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ జయంతిని పురస్కరించుకుని ఆర్‌కె పేట్‌లో ప్రతి సంవత్సరం జనవరి 17 నుండి 19 వరకు కోళ్ల పందాలు నిర్వహిస్తుంటారు. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకకు చెందిన వివిధ జట్లకు చెందిన దాదాపు 1,000 మంది తమ శిక్షణ పొందిన కోళ్లతో వచ్చి పోటీల్లో పాల్గొంటారు. పోటీలో పాల్గొనే కోళ్లు అత్యున్నత పురస్కారాల కోసం పోటీపడుతుంటాయి. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఇక్కడ జరిగే కోళ్ల పందాలు పూర్తిగా పోలీసుల అనుమతితో, పోలీసుల సమక్షంలోనే నిర్వహించబడతాయి. అయితే, ఇక్కడ జరిగే కోళ్ల పందాలు ఏపీలోని కోస్తా జిల్లాల్లో మాదిరిగా కాకుండా పూర్తి భిన్నంగా జరుగుతాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

తిరువళ్లూరు జిల్లా రామకృష్ణ రాజపేటలో మూడు రోజుల పాటు నిర్వహించిన కోడిపందాల టోర్నమెంట్‌లో 386 కోళ్లు ఒకదానితో ఒకటి పోటీపడ్డాయి. ఇందులో పాల్గొన్న కోళ్ల కాళ్లకు కత్తులు కట్టుకుని పోరాడుతాయి. ఒక రకంగా ఇది రక్త క్రీడగా పరిగణించబడుతుంది. RK పెట్‌లోని కాక్‌ఫైట్ టోర్నమెంట్ మూడు రౌండ్‌లలో నిర్వహించబడుతుంది. ప్రతి రౌండ్‌కు 20 నిమిషాలు ఉంటుంది. ఇందులో తన ప్రత్యర్థిని ఓడించిన పందెంకోడిని మూడు రౌండ్‌లలో విజేతగా ప్రకటించబడుతుంది. మూడు రౌండ్‌లు టై అయితే మ్యాచ్ డ్రాగా ప్రకటించబడుతుంది.

అవార్డు గెలుచుకున్న పందెంకోడి యాజమాని విజయ్ ..తన కోడికి ఇచ్చిన డైట్ ప్లాన్‌ను మీడియాతో పంచుకున్నారు. గత రెండేళ్లుగా ప్రత్యేక శిక్షకులతో చాలా జాగ్రత్తలు తీసుకుని ఈ పందెంకోడికి శిక్షణ ఇచ్చినట్టుగా చెప్పారు. దీనికి ఇచ్చే ఆహారంలో బాదం, పచ్చి గుడ్లు, రాగి రోటీ, ఎముకల బలం కోసం కాల్షియం మాత్రలు ఉంటాయని చెప్పారు. శారీరక శ్రమలో భాగంగా, పందెంకోడిని ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం అరగంటపాటు వాకింగ్‌తో పాటు స్విమ్మింగ్‌ కూడా చేయిస్తామని చెప్పాడు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే, ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే పందెం కోళ్లకు తప్పనిసరిగా ముందుగానే వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. పశు వైద్యులు వాటిని పరిశీలించి, అవి పూర్తి ఆరోగ్యంగా ఉండి, పోరాటంలో పాల్గొనడానికి సరిపోతాయని ధృవీకరించాలి. అప్పుడే వాటికి పోటీలో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. టోర్నీకి ప్రవేశ రుసుము రూ.1,200గా నిర్ధారించారు. కాగా, ఈ యేడు పోటీలో గెలుపొందిన పందెం కోడి యజమాని విజయ్‌కు ‘బెస్ట్ కాక్’ ట్రోఫీని, ప్రశంసా పత్రాన్ని అందజేశారు నిర్వాహకులు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..