గొయ్యిలో పడి తాత కాలు విరిగితే.. 13ఏళ్ల మనవడు ఏం చేశాడో తెలుసా..?
క్కడ ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన అధికార యంత్రాంగం స్పందించి, ఇలాంటి రోడ్లకు కనీసం మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
మనదేశంలో ఏ మారుమూల రోడ్డు చూసినా ఏమున్నది గర్వకారణం.. గుంతులు, గతుకులు, కంకరతేలిన రోడ్లే ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలాంటి రోడ్లపై నిత్యం ఏదో ఒక చోట ఏవరో ఒకరు బాధితులు గాయాలపాలు కావటం, లేదంటే ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు అనేకం నిత్యం వార్తల్లో చూస్తూనే ఉంటాం.. అలాంటివి జరిగిన కొద్ది రోజులపాటు.. అందరూ హడావుడి చేయటం.. గుంతలు పూడ్చాలని డిమాండ్లు, ధర్నాలు, అవసరమైతే రాస్తారోకోలు చేస్తారు.. కానీ, ఎవరూ ముందుకు వచ్చి అందరం కలిసి ఆ రోడ్లను బాగుచేద్దాం అనే ఆలోచన మాత్రం ఎక్కడా చేయరు.. కానీ, ఓ పదమూడేళ్ల పిల్లవాడు మాత్రం.. తన తాతకు జరిగింది మరేవరికీ జరగకుండా ఉండాలని భావించాడు. తానే స్వయంగా రంగంలోకి దిగి పాడైపోయిన రోడ్డును బాగుచేస్తున్నాడు.. వివరాల్లోకి వెళితే..
పుదుచ్చేరిలోని మారుమూల ప్రాంతంలో రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చేందుకు 13 ఏళ్ల బాలుడు ఒంటరిగా పనిచేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం బాలుడి తాత రోడ్డుపై ఉన్న గుంతలో పడి గాయపడ్డాడు. ఈ గుంతల వల్ల మరొకరి ప్రాణాలకు ప్రమాదం జరగకూడదని ఆ బాలుడు భావించాడు. అందుకే తానే స్వయంగా ఈ గుంతలు పూడుస్తున్నాడు. దీంతో అందరూ అతడిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అసలే గొయ్యిలో పడి బాలుడి తాత కాలు విరిగింది. స్వయంగా పోరాడి సిమెంటు పోసి ఆ గొయ్యిని నింపాడు. ఇదొక్కటే కాదు, ఈ బాలుడు ఆ ప్రాంతంలోని ఇతర గుంతలను కూడా పూడుస్తున్నాడు. ఈ గుంతల వల్ల ఎవరైనా రోడ్డు ప్రమాదానికి గురవడం తనకు ఇష్టం లేదని అంటున్నాడు.
ఆ బాలుడి పేరు మసిల్మణి. చదువుతున్నది VIII తరగతి. కొన్ని రోజుల క్రితం వృత్తిరీత్యా రైతు అయిన తన తాత ఏదో పని నిమిత్తం బైక్‌పై ఎక్కడికో వెళ్తున్నాండగా, అతని బైక్ దారిలో ఉన్న గుంతలో పడింది. దీంతో అతని కాళ్లు విరిగిపోయాయి. తాతయ్య దీనావస్థను చూసి ప్రభుత్వం కానీ, పాలనా యంత్రాంగం కానీ, ఎవరూ సాయం చేయలేదని వాపోయాడు. అధికారులు కూడా పట్టించుకుని రోడ్లు బాగు చేయలేదని అన్నాడు. దీంతో తానే ఏదో ఒకటి చేయాలని అనుకున్నాడు. తానే స్వయంగా ఇసుక, కంకర, సిమెంటు సేకరించి రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చడం ప్రారంభించాడు.. మసిల్‌మణి సేందంత ప్రాంతంలో నివాసిస్తున్నాడు. తాత పడి గాయపడిన గొయ్యిని మొదట పూడ్చాడు. దీంతో పాటు పరిసర ప్రాంతాల్లోని రోడ్లపై ఉన్న గుంతలను కూడా పూడ్చాడు.
13 ఏళ్ల బాలుడు ఇలా గుంతలు పూడుస్తున్నాడని తెలియగానే స్థానికులంతా అతన్ని తెగ మెచ్చుకున్నారు. అదే సమయంలో, పుదుచ్చేరి-పతుకన్ను రహదారి గత ఏడేళ్లుగా అధ్వాన్నంగా ఉందని స్థానిక నివాసి చెప్పారు. దీనిపై అధికార యంత్రాంగం దృష్టి సారించడం లేదు. ఇక్కడ ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన అధికార యంత్రాంగం స్పందించి, ఇలాంటి రోడ్లకు కనీసం మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..