Trending: ఆ స్కూల్లో ఒకే ఒక్కడు.. మధ్యాహ్న భోజనంతో పాటు సకల వసతులు.. మీరూ ఓ లుక్కేసేయండి..

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నామని చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. బడి ఈడు పిల్లలను స్కూల్లో చేర్చేందుకు అధికారులు, ఉపాధ్యాయులు చర్యలు చేపడుతున్నా...

Trending: ఆ స్కూల్లో ఒకే ఒక్కడు.. మధ్యాహ్న భోజనంతో పాటు సకల వసతులు.. మీరూ ఓ లుక్కేసేయండి..
Single Student
Follow us

|

Updated on: Jan 23, 2023 | 10:50 AM

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నామని చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. బడి ఈడు పిల్లలను స్కూల్లో చేర్చేందుకు అధికారులు, ఉపాధ్యాయులు చర్యలు చేపడుతున్నా విద్యార్థుల సంఖ్య పెరగడం లేదు. మారుమూల గ్రామాల్లోనే కాకుండా పట్టణాలు, నగరాల్లోని ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. పది, ఇరవై మంది విద్యార్ధులున్న పాఠశాలలనే క్లోజ్‌ చేసి పడేస్తున్నాయి ప్రభుత్వాలు. ఇంత తక్కువ మందికి ఇక్కడ స్కూలు అవసరమా అన్న చందంగా వాటిని తీసుకెళ్లి వేరే ప్రాంతాల్లోని పాఠశాలల్లో కలిపేయడమో లేక అక్కడ మొత్తం పాఠశాలనే తీసేయడమో చేస్తున్నారు. కానీ ఇక్కడ పాఠశాల కేవలం ఒకే ఒక్క విద్యార్ధితో నడుస్తోంది. మధ్యాహ్న భోజన సదుపాయంతో పాటు అన్నివసతులు ఆ సర్కారు బడిలో ఉన్నాయి. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం.

మహారాష్ట్రలోని వాషిమ్‌ జిల్లాలో ఓ సర్కారు బడి కేవలం ఒక్క విద్యార్థి కోసమే నడుస్తోంది. ఒక్కరోజు కూడా ఈ స్కూలు మూసివేసిన దాఖాలు లేవు. అతని కోసం కిశోర్‌ మన్కర్‌ అనే ఉపాధ్యాయుడు ప్రతి రోజూ ఏకంగా 12 కిలోమీటర్ల దూరం ప్రయాణించి వస్తారు. అన్ని సబ్జెక్టులు అతనే ఆ విద్యార్ధికి ఎంతో శ్రద్ధగా నేర్పుతారు. ముంబయి లోని వాషిమ్‌ జిల్లాలోని గణేశ్‌పూర్‌లో 150 మంది నివసిస్తున్నారు. ఈ గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి నుంచి 4వ తరగతి వరకు బోధిస్తున్నారు. అయితే ఆ స్కూల్‌లో కార్తిక్‌ షెగ్‌కర్‌ అనే ఒకే ఒక విద్యార్థి మాత్రమే చదువుకుంటున్నాడు. ఈ ఒక్కడి కోసం స్కూలు అవసరమా అని స్కూల్‌ను ఇతర ప్రాంతాలకు తరలించలేదు సరికదా.. ఆ ఒక్కడితోనే జిల్లా యంత్రాంగం పాఠశాల నడిపిస్తోంది. మధ్యాహ్న భోజనంతోపాటు అన్ని వసతులు కల్పిస్తోంది.

ఇవి కూడా చదవండి

స్కూల్‌లో నేను టీచర్‌ పని చేస్తున్నాను. సింగిల్ స్టూడెంట్ కు అన్ని సబ్జెక్టులు నేనే బోధిస్తాను. కార్తిక్‌ ప్రతిరోజూ స్కూల్‌కి వస్తాడు. ఇద్దరం కలిసి ఉదయాన్నే ప్రార్థన చేస్తాం. అతని కోసం పాఠశాలలో అన్ని వసతులు కల్పించామని తెలిపారు. రెండేళ్లనుంచి అతనొక్కడే పేరు నమోదుచేసుకుంటున్నాడు.

        – కిశోర్ మన్కర్, ఉపాధ్యాయుడు

మరిన్ని జాతీయ వార్తల కోసం