AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WATCH: అరక్కోణం ద్రౌపది అమ్మన్‌ ఆలయ ఉత్సవాల్లో విషాదం.. క్రేన్ బోల్తా పడటంతో ముగ్గురు మృతి..

అరక్కోణం సమీపంలోని ద్రౌపది అమ్మన్‌ ఆలయ ఉత్సవాల సందర్భంగా క్రేన్‌ ఒక్కసారిగా పడిపోవడంతో నలుగురు మృతిచెందారు. రాణిపేట జిల్లాలో ఆలయ ఉత్సవాలు ఉత్సాహంగా జరగాల్సిన ద్రౌపది అమ్మన్ ఆలయం విషాదంగా ముగిసింది. ఆలయ ఉత్సవాల్లో క్రేన్ ప్రమాదంలో విషాదం నెలకొంది.

WATCH: అరక్కోణం ద్రౌపది అమ్మన్‌ ఆలయ ఉత్సవాల్లో విషాదం.. క్రేన్ బోల్తా పడటంతో ముగ్గురు మృతి..
Crane Collapses
Sanjay Kasula
|

Updated on: Jan 23, 2023 | 10:33 AM

Share

తమిళనాడు అరక్కోణంలో ఘోర ప్రమాదం జరిగింది. రాణిపేట జిల్లా కిలివీడి మాండియమ్మన్‌ ఆలయంలో భక్తులపై కుప్పకూలింది ఓ భారీ క్రేన్‌. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా..ఓ బాలిక సహా తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని పున్నై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మైలార్‌ ఉత్సవాల్లో జరిగింది ఈ విషాద ఘటన. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ దాదాపు 1500 మంది భక్తులు ఉన్నారు. ఈ క్రేన్ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారగా.. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు.

రాణిపేట జిల్లా నెమిలి వట్టం కిలివీధి గ్రామంలోని ద్రౌపది ఆలయంలో మైలార్ ఉత్సవం జరుగుతోంది. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. ఇదిలా ఉండగా పండుగ సందర్భంగా క్రేన్ బోల్తా పడి ఒక్కసారిగా ప్రమాదం జరిగింది. క్రేన్ ద్వారా అమ్మవారికి పూలమాలలు వేసేందుకు ప్రయత్నించారు. అయితే పూలమాలలు వేస్తుండగా క్రేన్ ముందు భాగం ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది. దీంతో భక్తులపై క్రేన్ పడిపోయింది.

ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు తొలుత సమాచారం అందగా, ప్రస్తుతం మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ ప్రమాదంలో కీల్వీడికి చెందిన కూలీ ముత్తు(42), జాతరలో ఐస్‌ అమ్ముకోవడానికి వచ్చిన వ్యాపారి భూబాలన్‌ మృతి చెందారు. అలాగే, క్రేన్‌కు వేలాడుతున్న కిలివీధికి చెందిన +2 విద్యార్థి 17 ఏళ్ల జ్యోతి బాబు కూడా కిందపడి మరణించాడు.

దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఆలయంలో భారీగా జనం ఉన్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. క్రేన్‌తో అమ్మవారికి పూలమాల వేయడానికి ప్రయత్నిస్తున్నారు. క్రేన్‌పై కొందరు వ్యక్తులు ఉన్నట్లు కూడా స్పష్టమైంది. ఎవరూ ఊహించని విధంగా క్రేన్ ఎడమవైపుకు ఒరిగిపోవడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది.

వీడియోను ఇక్కడ చూడండి..

ప్రమాదం జరిగిన వెంటనే గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న జిల్లా యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకుంది. అయితే, దండ వేసేందుకు ఉపయోగించిన క్రేన్‌కు ఎలాంటి అనుమతి లేదని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్