Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Updates: జనవరి 24 నుండి అక్కడ భారీ వర్ష సూచన.. దేశంలో పెరగున్న చలి తీవ్రత..!

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఢిల్లీ సహా ఉత్తర భారతదేశం మొత్తం రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అందువల్ల జనవరి 23 నుంచి మళ్లీ చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 13, 08 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటాయి.

Rain Updates: జనవరి 24 నుండి అక్కడ భారీ వర్ష సూచన.. దేశంలో పెరగున్న చలి తీవ్రత..!
Rain Updates
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 23, 2023 | 10:52 AM

జనవరి 24 నుంచి ఢిల్లీ సహా ఉత్తర భారతంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది . పర్వతాల్లో మంచు కురిసే అవకాశం ఉందని.. పశ్చిమ హిమాలయాల్లో చలిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వాతావరణం మేఘావృతమై తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ శాస్త్రవేత్త సోమా సేన్ రాయ్ తెలిపారు. గత రెండు వారాలుగా కొనసాగుతున్న చలి కొంతమేర తగ్గుముఖం పట్టింది. కానీ, ఉత్తరాది నుంచి వీస్తున్న గాలుల కారణంగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో చలితీవ్రత కొనసాగుతోంది. నాసిక్, జల్గావ్, విదర్భలోని కొన్ని జిల్లాల్లో రానున్న రెండు రోజుల పాటు చలి వాతావరణం ఉండే అవకాశం ఉంది. కానీ వాతావరణ శాఖ ఇచ్చిన సూచన ప్రకారం జనవరి 27 నుంచి ఫిబ్రవరి 2 మధ్య మరఠ్వాడా, విదర్భ, పరిసర ప్రాంతాల్లో తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే 25వ తేదీ నుంచి మేఘావృతమైన వాతావరణం కొనసాగే అవకాశం ఉంది.

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఢిల్లీ సహా ఉత్తర భారతదేశం మొత్తం రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అందువల్ల జనవరి 23 నుంచి మళ్లీ చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వచ్చే వారం నుండి ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు, కొండ ప్రాంతాల్లో మంచు కురుస్తుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ తర్వాత జనవరి 23 నుంచి ఉత్తర భారతంలో మరోమారు చలిగాలులు వీచే అవకాశం ఉంది.

చంబా, కాంగ్రా, మండి, కులు, సిమ్లా, లాహౌల్-స్పితి మరియు కిన్నౌర్ జిల్లాల్లో భారీ వర్షం, మంచు కురుస్తుంది. జనవరి 25 వరకు కొండ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మనాలిలో 12 సెంటీమీటర్లు, గోండ్లాలో 11 సెంటీమీటర్లు, డల్హౌసీలో 8 సెంటీమీటర్లు, కల్పాలో 7 సెంటీమీటర్లు, తిస్సా, పూహ్ మరియు హంసాలో ఒక్కొక్కటి చొప్పున వర్షపాతం నమోదైంది. హిమాచల్‌లో కనీసం 328 రహదారులు మూసివేయబడ్డాయి. వీటిలో లాహౌల్-స్పితి జిల్లాలో 182, కలులో 55, సిమ్లాలో 32, కిన్నౌర్‌లో 29, మండిలో 17, చంబా, కాంగ్రా జిల్లాల్లో 11 ఉన్నాయి. ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ పేలవంగా ఉంది. రాబోయే కొద్ది రోజుల పాటు దేశ రాజధానిలో పొగమంచు పరిస్థితులు ఉండే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

23న పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్‌లలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. తర్వాత 24-27 మధ్య ఢిల్లీలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 13, 08 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..