AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఈ గోస ఎవలకు రావద్దు రో.. అయ్యో..? ఇంత చిన్న వయసులో ఎంతకష్టం వీడికి..!

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇంటర్‌నెట్‌ సదుపాయాన్ని వినియోగించుకుని చాలా మంది ఇలాంటి వీడియోలనే సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తున్నారు. చిన్నారులు చేసే ప్రతిదీ అద్భుతమైన,

Viral Video: ఈ గోస ఎవలకు రావద్దు రో.. అయ్యో..? ఇంత చిన్న వయసులో ఎంతకష్టం వీడికి..!
Boy Cry
Jyothi Gadda
|

Updated on: Jan 23, 2023 | 9:26 AM

Share

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. వాటిల్లో ఎక్కువగా జంతువులు, పక్షులు, పాములకు సంబంధిచినవి ఎక్కువగా ఉంటాయి. అడవి జంతువులు చేసే అల్లరి, విచిత్ర పనులు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి. అలాగే, పెంపుడు జంతువుల వీడియోలు కూడా నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తుంటాయి. కుటుంబ సభ్యులతో పెంపుడు జంతువులు చేసే అల్లరి మామూలుగా ఉండదు. ఇకపోతే, ఇంట్లో ఉండే చిన్నపిల్లల అల్లరి, చిత్రవిచిత్ర కొంటె పనులను గురించి ఇక చెప్పనక్కర్లేదు. పిల్లలు చేసే ప్రతిపనిని తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా ఫోటోలు, వీడియోలు తీసి పదిలపరుచుకుంటున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇంటర్‌నెట్‌ సదుపాయాన్ని వినియోగించుకుని చాలా మంది ఇలాంటి వీడియోలనే సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తున్నారు. చిన్నారులు చేసే ప్రతిదీ అద్భుతమైన, ఆసక్తికరమైన సన్నివేశాలను క్యాప్చర్‌ చేసుకుంటున్నారు. అలాంటిదే ఈ వీడియో కూడా..ఇంతకీ వీడియోలో ఏముందంటే..

సంక్రాంతి సెలవులు ముగిశాయి.. బడి గంట కొట్టింది. పుస్తకాల బ్యాగ్‌లతో పిల్లలంతా బడిబాటపట్టారు..ఇక స్కూళ్లు మళ్లీ తెరిచారని తెలియగానే చాలా మంది పిల్లలు ఉత్సాహమంతా పోయి నీరుగారిపోతారు. అబ్బా మళ్లీ స్కూల్ కి వెళ్లాలా అన్న బాధలో ఉంటారు. కొంతమంది పిల్లలు స్కూల్ తెరిచిన మొదటి రోజు హ్యాపీగా వెళ్తే.. మరికొంతమంది పిల్లలు తెగ మారాం చేస్తూ ఉంటారు. ఇక చిన్న పిల్లలను స్కూల్ కి పంపడానికి తల్లిదండ్రులు పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. అయితే ఇక్కడ కూడా ఈ బుడ్డొడు చేసిన మారాం అంతా ఇంతాకాదు..

ఇవి కూడా చదవండి

సుమతీ ఐపీఎస్‌((Sumathi IPS) తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేసిన ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా తెగ హల్‌చల్‌ చేస్తోంది. వీడియో అప్‌లోడ్‌ చేసి కేవలం ఒకరోజు గడవకుండానే దాదాపు 62వేల వీక్షణలతో దూసుకుపోతోంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు. బడికి వెళ్లమంటే బుడ్డొడ్డు పడ్డ బాధ..  ఓరీ దేవుడో.. ఓరీ నాయనో.. ఈ కష్టం నాకొద్దంటూ వాడు పడ్డ వేదన వర్ణనాతీతం.. కావాలంటే వీడియోపై మరో లుక్కేయండి..

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..