Trending: 11 నెలల బాలుడికి అస్వస్థత.. హాస్పిటల్ కు తీసుకెళ్లిన పేరెంట్స్.. వైద్య పరీక్షల్లో బయటపడిన సంచలనం..
కుమారుడు పుట్టాడన్న సంతోషం ఆ తల్లిదండ్రులకు ఎంతో కాలం నిలవలేదు. 11నెలల వయసులోనే తీవ్ర అస్వస్థతకు గురవడంతో కంగారు పడిపోయారు ఆ పేరెంట్స్. ఏం జరుగిందో తెలియక.. లబోదిబోమంటూ డాక్టర్ల...
కుమారుడు పుట్టాడన్న సంతోషం ఆ తల్లిదండ్రులకు ఎంతో కాలం నిలవలేదు. 11నెలల వయసులోనే తీవ్ర అస్వస్థతకు గురవడంతో కంగారు పడిపోయారు ఆ పేరెంట్స్. ఏం జరుగిందో తెలియక.. లబోదిబోమంటూ డాక్టర్ల దగ్గరికి పరిగెత్తారు. తమ బిడ్డను కాపాడాలని వేడుకున్నారు. చిన్నారికి వివిధ టెస్టులు చేసిన డాక్టర్స్.. ఓ షాకింగ్ విషయాన్ని గుర్తించారు. ఆ చిన్నారి కడుపులో పిండం ఉన్నట్లు గుర్తించారు. వెంటనే లేట్ చేయకుండా సర్జరీ చేసి.. బాలుడిని కాపాడారు. అరుణాచల్ ప్రదేశ్చాంగ్లాంగ్ జిల్లాకు చెందిన బాలుడు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు చిన్నారికి చికిత్స అందించేందుకు వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. బాలుడికి అన్ని రకాల పరీక్షలు చేసిన వైద్యులు.. ఓ షాకింగ్ న్యూస్ తెలుసుకున్నారు. చిన్నారి కడుపులో పిండం ఉండడాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని బాలుడి పేరెంట్స్ కు చెప్పారు. పిండాన్ని తీసేయాలని చెప్పారు. వారిని ఒప్పించారు.
తల్లిదండ్రుల అంగీకారంతో బాలుడికి సర్జరీ చేసి పిండం తొలగించారు. బాలుడికి విజయవంతంగా చికిత్స చేశారు. ప్రస్తుతం చిన్నారి పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు చెప్పారు. అయితే.. చిన్న పిల్లల కడుపులో పిండం ఉండటాన్ని వైద్య పరిభాషలో ఫెటస్-ఇన్-ఫీటూ అంటారు. ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతంటాయని నిపుణులు చెబుతున్నారు. చిన్నారి చికిత్స విజయవంతం కావడంపై కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ శస్త్రచికిత్స చాలా సవాల్ తో కూడుకున్నది. అప్రమత్తంగా లేకుంటే రక్తస్రావం జరిగే అవకాశం ఉంది. 10 లక్షల మందిలో ఒకరిలో మాత్రమే ఇలా జరుగుతుంది. గర్భాశయంలో కవలలు వృద్ధి చెందుతున్న దశలో ఏర్పడే వైకల్యం వల్ల ఇది ఏర్పడుతుంది. చిన్నారి తల్లి కడుపులో రెండు పిండాలు ఉన్నప్పుడు.. ఓ పిండం పూర్తి స్థాయిలో వృద్ధి చెందదు. అది వృద్ధి చెందిన మరో పిండంలో అలాగే ఉండి చనిపోతుంది. దీంతో ఫీటస్ ఇన్ ఫీటు సమస్య వస్తుంది.
– వైద్యులు..
మరిన్ని జాతీయ వార్తల కోసం